రాష్ట్రీయం

తల్లిరాక కోసం.. తనువెల్లా కనులై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, ఫిబ్రవరి 5: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టంలో భాగంగా గురువారం సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి మేడారంలోని గద్దెలకు చేరనుంది. బుధవారం సమ్మక్క కుమార్తె సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు బుధవారమే మేడారం చేరుకోగా, గురువారం తల్లి సమ్మక్కను గిరిజన పుజారులు చిలకలగుట్ట నుండి కుంకుమభరిణె రూపంలో గద్దెలకు తీసుకువస్తారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తరువాత భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమ్మవార్ల దర్శనానికి రానున్నారు. జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించారు. సీఎం, గవర్నర్ జాతరకు వస్తుండడంతో మంత్రులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటికే అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. సారలమ్మ ఆగమనంతో గద్దెల వద్ద భక్తుల రద్దీ పెరగడంతో పాటు గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి రావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్షలాది మంది భక్తులు సమ్మక్క - సారలమ్మ తల్లులను తమ ఇలవేల్పులుగా కొలుస్తారు. ప్రతి రెండేళ్లకోమారు మాఘశుద్ధపౌర్ణమి రోజున జరిగే జాతరకు కోటికి పైగా భక్తులు మేడారం వచ్చి నెరవేరిన కోర్కెలకు ప్రతిఫలంగా తల్లులకు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కొత్తగా కోర్కెలతో తల్లులకు ప్రణమిల్లి నెరవేర్చాలని కోరుకుంటారు. పేరుకు గిరిజన జాతర అయినప్పటికీ గిరిజనేతరులతో పాటు ఇతర మతాలకు చెందినవారు సైతం మేడారం జాతరకు వస్తుండంటంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే మేడారం చేరుకోగా గురువారం నాడు లక్షలాది మంది మేడారం వస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. సమ్మక్క తల్లి గురువారం గద్దెకు చేరుకున్న తరువాత మొక్కులు తీర్చుకునేందుకు భక్తజనం నిలువెళ్ల కనులు చేసుకొని తల్లి రాక కోసం మేడారంలో నిరీక్షిస్తున్నారు.

*చిత్రం... విద్యుత్ వెలుగు జిలుగుల్లో మెరిసిపోతున్న మేడారం