రాష్ట్రీయం

సింహ వాహనంపై ఊరేగిన నరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 6: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల మూడవ రోజు గురువారం సింహముఖుడైన శ్రీ లక్ష్మీనరసింహుడు సింహవాహన అలంకార సేవలో, అశ్వవాహన అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యారాధనల అంతరం ప్రబంధ పారాయణాలు, యాజ్ఞీకులతో నిత్య హవనములు మూలమంత్ర జపములు పాంచరాత్రిగమరీత్యా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవారిని సింహహవాన సేవలో అలంకరించి తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. హిరణ్యకశ్యపుడిని వధించి జగద్రక్షణ చేసేందుకు స్వామివారు సింహముఖుడిగా నరసింహవతారం దాల్చారని, సింహ శబ్దం అంటే శతృభీతి, పాపనాశన, ఆశ్రీత రక్షణ తత్పరత ఒటే చోట గూర్చిన నరసింహ అవతారమని పురాణాల ప్రశస్తి. ప్రాతః స్మరణీయ శ్రీ నృసింహ రూపమని వేద పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు వేడుకను పండిత బృందం శాస్తయ్రుక్తంగా నిర్వహించింది. అశ్వవాహన అలంకారసేవలో జగద్రక్షుడైన లక్ష్మీనరసింహుడిని మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆస్థాన కల్యాణ మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. క్షీరరాజ తనయ, జగద్రక్షిణి శ్రీ లక్ష్మీ అమ్మవారిని ముత్యాల పల్లకిలో కల్యాణ మండపం వద్దకు మేళతాళాలతో తోడ్కొని రాగా స్వామిఅమ్మవార్ల ఇరువురి పెద్దలు, పండితులు వధూవరులై శ్రీ లక్ష్మీనరసింహుల గుణగణాలను, వైభవాన్ని, గొప్పతన విశేషాలను, అమ్మవారి దయాగుణాన్ని ప్రస్తుతిస్తూ ఎదుర్కోలు వేడుకను రక్తిదాయకంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు లక్ష్మీనరసింహులకు లగ్నపత్రికను రాసుకుని నేడు శుక్రవారం రాత్రి 8గంటలకు తిరుకల్యాణత్సవం నిర్వహించ సుమూహుర్తం నిర్ణయించారు. ఆయా అలంకార సేవలు, ఎదుర్కోలు ఘట్టం ప్రధానార్చకుల నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, యాజ్ఞీకులు భాష్యకార్ స్వామి పర్యవేక్షణలో ఆద్యంతరం శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*చిత్రం..సింహ వాహనంపై ఊరేగిన నరసింహుడు