రాష్ట్రీయం

ఒక రాజధానే ఉండాలి కానీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 6: రాష్ట్రానికి మూడు రాజధానుల కంటే ఒక రాజధాని ఉండటమే మంచిదని, అయితే అది విపక్ష నేత చంద్రబాబు ఊహాత్మక అమరావతిలా కాకుండా వేరేవిధంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచి పరిణామమేనని కర్నూలుకు, వైజాగ్‌కు కొన్ని హెచ్‌వోడీ కార్యాలయాలు తరలింపును బీజేపీ సమర్ధిస్తుంది కానీ పాలన రాజధానిగా అమరావతే ఉండాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తెలుగు మాధ్యమంపై తీవ్ర అభ్యంతరం తెలపడం, మూడు రాజధానులను వ్యతిరేకించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో శాసనమండలిని రద్దుచేయడం దారుణమన్నారు. ఇప్పటికే మండలిలో ఆగిపోయిన బిల్లులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలే తప్ప ఇలా మండలి రద్దు చేయడం మంచి పరిణామం కాదన్నారు.
శాసనమండలి రద్దు నిర్ణయం ఏకపక్ష చర్య అని, ఈవిషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పునరాలోచించాలని మాధవ్ అభిప్రాయపడ్డారు. రాజధాని బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లినా అవి ఆమోదం పొందుతాయని, ఈ విషయంలో శాసనమండలి రద్దు తగదన్నారు.కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానుకోకపోతే చంద్రబాబునాయుడుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మేలుచేసేదిగా ఉంటుందని, ప్రాంతాల వారీగా బడ్జెట్‌లో నిర్ణయం చేయకూడదనేది బీజేపీ నిర్ణయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు గత ఏడాది 60 వేల కోట్లు కేంద్ర నిధులు ఇచ్చారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ నిధులు రాబట్టవచ్చునన్నారు. కోనసీమలో కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను కోసం బీజేపీ జాతీయ నేత వారణాసి రామ్‌మాధవ్ ప్రత్యేక చొరవతో రూ.1200 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఈ నిధులతో కోనసీమలో మూడు రైల్వే వంతెనల నిర్మాణంతోపాటు ట్రాక్ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతీ 100 కిలోమీటర్లకు గ్యాస్ టెర్మినల్ ఏర్పాటు చేయడంతోపాటు పైపులైన్లకు పక్కనే సెన్సార్లు ఏర్పాటుచేసి వాటికి జియో ట్యాగింగ్ చేయడం ద్వారా గ్యాస్ లీకేజీలను సమర్ధవంతంగా అరికట్టవచ్చునని మాధవ్ పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోకా వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్