రాష్ట్రీయం

రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 6: నిత్యం ప్రయాణికులతో రద్దీ ఉండే సికిందరాబాద్ రైల్వే సేషన్‌లో బాంబు ఉందని బెదిరింపు వచ్చింది. రైల్వే స్టేషన్ ఆవరణలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఐదున్నర గంటలకు సికిందరాబాద్ నుంచి బయల్దేరి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్ లో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి నుంచి డయల్ 100కు పోను రావడంతో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
రైల్వే అధికారులతో మాట్లాడి ప్లాట్ ఫారం ఒకటి నుంచి బయలుదేరడానికి సిద్దంగా ఉన్న రైల్‌ను వెంటనే ప్లాట్ ఫారం రెండుకు మళ్లించి, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు జాగిలలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు అందోళన చెందకుండా వారికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు మొత్తం రైలులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు రైలులో బాంబు లేదని, ఇది ఆకతాయి చేష్టగా నిర్దారించటంతో ప్రయాణికలు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గంట నుంచి రెండు గంటల ఆలస్యంగా రైలు బయల్దేరింది. ఆర్‌పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ గాంధీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డయల్ 100కు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
*చిత్రం...ఇంటర్‌సిటీ రైలులో జాగిలాలతో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు