రాష్ట్రీయం

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్-2 షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రద్దీ, ట్రాఫిక్ నుంచి ప్రజలకు ఊరట కలిగించడంతోపాటు ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తయింది. ఇందులో ఇప్పటికే నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కారిడార్-3, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు కారిడార్-1 ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సికిందరాబాద్ జేబీఎస్ నుంచి గౌలిగూడ ఎంజీబీఎస్ వరకు ఏర్పాటు చేసిన కారిడార్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శుక్రవారం మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ కారిడార్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇతర నేతలు భారీగా జన సమీకరణ చేశారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు జేబీఎస్‌లో జెండా ఊపి సీఎం మెట్రో రైలులో ప్ర యాణించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇదో అరుదైన అనుభూతి
మెట్రో కారిడార్లలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్‌లో ప్రయాణించడం నగరవాసులకు ఓ అరుదైన అనుభూతిని కలిగించనుంది. భూమి ఉపరితలం నుంచి సుమారు 53 అడుగుల ఎత్తులో అంటే దాదాపు ఐదు అంతస్తుల ఎత్తులో ఈ కారిడార్‌ను నిర్మించారు. అంతటి ఎత్తు నుంచి నగర శోభను తిలకిస్తూ ప్రయాణించడం నగరవాసులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది.
నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి..
జేబీఎస్ నుంచి గౌలిగూడ ఎంజీబీఎస్ వరకు శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన మెట్రో రైలు సేవలు శనివారం ఉదయం ఆరున్నర గంటల నుంచి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు మెట్రో రైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ప్రొటోకాల్‌పై అసహనం
శుక్రవారం జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రకటనల్లో తమ పేర్లు, ఫొటోలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు నేతలను మంత్రులు ప్రారంభోత్సవానికి ముందే బుజ్జగించి, శాంతింపజేసినట్లు సమాచారం.

*చిత్రం... జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్