రాష్ట్రీయం

జైళ్లు ఐదు.. ఉరికంబం ఒక్కటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 7: మహిళలపై అత్యాచారాలు, హత్య కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఉరిశిక్ష విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఉరిశిక్ష అమలుపై పడింది. అసలు రాష్ట్రంలో ఎన్ని కేంద్ర కారాగారాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ ఉరిశిక్ష అమలుకు ఉరికంబాలు ఉన్నాయి అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో ఐదు కేంద్ర కారాగారాలు ఉన్నాయి. అయితే ఉరిశిక్ష అమలు చేయాలంటే ఒక్క రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే సాధ్యమవుతుంది. అక్కడ మాత్రమే ఉరికంబం ఉంది. ఇతర జైళ్లలో లేవు. రాష్ట్రంలో ఐదు కేంద్ర కారాగారాలు ఉండగా అందులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. అతి పురాతన కేంద్ర కారాగారంగా గుర్తింపు దక్కించుకున్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం 1864లో నిర్మించారు. ఆ తరువాత నెల్లూరులో 1901, కడపలో 1992, విశాఖపట్టణంలో 2001లో కేంద్ర కారాగారాలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో మహిళా ఖైదీల కోసం ప్రత్యేకంగా ఒక కారాగారం కూడా ఉంది. ఈ ఐదు జైళ్లలో ఒక్క రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మాత్రమే నేరస్థులను ఉరి తీసేందుకు ఉరికంబం ఉంది. ఇక్కడ చిట్టచివరిసారిగా 1978లో అనంతపురం జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని హత్య కేసులో ఉరి తీశారు. ఆ తరువాత ఉరిశిక్ష అమలు కాలేదు.
మహిళలను హతమార్చడం, అత్యాచారానికి పాల్పడిన సంఘటనల్లో శరవేగంగా విచారణ పూర్తి చేస్తున్న న్యాయస్థానాలు నిందితులకు శిక్ష విధిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం దిశ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్న నేపధ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులపై విచారణ కేవలం 21 రోజుల్లో ముగియనుంది. నేరం రుజువైతే నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. గతంలో ఉరి శిక్ష విధించడాన్ని ప్రభుత్వం, సుప్రీం కోర్టులు పూర్తి స్థాయిలో తగ్గించాయి. నేర తీవ్రత అత్యధికంగా ఉన్న కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష విధించేవారు. అయితే ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కారణంగా మరోమారు ఉరిశిక్ష తెరపైకి వచ్చింది. మహిళలపై దారుణాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష సరైందని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో ఉరిశిక్ష విధించేందుకు న్యాయస్థానాలు సైతం అంగీకరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దిశపై అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనను ప్రజలు సమర్థించి పోలీసులు హీరోలు అంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలను బాధ్యులైన వారి కేసు విచారణను 21 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఇది అమలులోకి వస్తే నేర విచారణ శరవేగంగా పూర్తవుతుందని, నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసు అధికారులంటున్నారు. దిశ చట్టం కింద కింది కోర్టులు ఇచ్చే తీర్పులపై నిందితులు ఉన్నత
న్యాయస్థానాలను ఆశ్రయిస్తే అక్కడ కూడా తీర్పులు త్వరితగతిన వస్తాయని వెల్లడిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి విషయంలో అన్ని మార్గాలు మూసుకుపోయి ఉరిశిక్ష అమలుకు గరిష్టంగా ఆరు నెలలకు మించి సమయం పట్టదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని కేంద్ర కారాగారాల్లో ఉరికంబాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక ప్రాంతానికి చెందిన ఖైదీని మరో ప్రాంతానికి తరలించి ఉరి శిక్ష అమలు చేయడం జైలు నిబంధనల ప్రకారం వీలుకాదు. కేంద్ర గారాల్లో ఒక గదిని ప్రత్యేకించి ఉరిశిక్ష అమలుకు కేటాయించి అక్కడ ఉరి కంబం ఏర్పాటు చేస్తే సరిపోతుందని సంబంధితశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

*చిత్రం... రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారం