రాష్ట్రీయం

హైకోర్టు తరలింపునకు సన్నాహాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టును బుద్వేలుకు తరలించి ప్రస్తుతం ఉన్న ప్రాంగణాన్ని మ్యూజియంగా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయమూర్తులతో పాటు సిబ్బంది , సహాయకులతో సందర్శకులతోనూ, అధికారులతోనూ హైకోర్టు కిక్కిరిసిపోతుండడంతో అందరికీ అసౌకర్యంగా ఉంటోంది. ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్యలు కూడా తలెత్తడంతో పాటు ఛాంబర్లు చాలా ఇరుకుగా మారాయి. విశాలంగా ఉండాల్సిన కోర్టు హాళ్లు కూడా ఎలాంటి ఆధునిక సౌకర్యాలకు నోచుకోకుండా ఉండడంతో అత్యాధునిక భవంతిని హైకోర్టుకు నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. బుద్వేలుకు తరలించి అక్కడ హైకోర్టు సహా అనుబంధ కోర్టు ప్రాంగణాలను కూడా అక్కడే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండగా, న్యాయవాదులు మాత్రం దానిని వ్యతిరేకిస్తున్నారు. పాతబస్తీలో చార్మినార్‌కు సమీపంలో ఉండడంతో అందరికీ సౌకర్యవంతంగా ఉంటోందని, ఇపుడు దానిని ఊరు చివరకు మారిస్తే అందరికీ అసౌకర్యంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఒక దశలో సేవ్ హైకోర్టు పేరుతో ఉద్యమ కమిటీ ఏర్పాటై హైకోర్టును పాతబస్తీలోనే కొనసాగించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. హైకోర్టును తరలించే యోచన ప్రభుత్వానికి లేదని న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల శాసనసభలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అయినా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కొంతమంది న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. జ్యుడీషియల్ మ్యూజియం నిర్మాణం కోసం సీఆర్‌పీ ఓల్ట్ రికార్ట్సు హాలును తక్షణం ఖాళీ చేయాలని ఆదేశాలు అందిందే మొదలు వాటిని అమలు చేశారని తెలిసింది. బర్కత్‌పురా నల్సార్ భవనానికి సీఆర్‌పీ డిపాజిట్ రికార్డులను మార్చినట్టు సమాచారం. అయితే రికార్డులు మార్చినా అందుకు అనుగుణమైన భద్రతా చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి హైకోర్టు తరలింపుపై ఏ ఒక్కరూ నిర్ణయం తీసుకోకపోగా, అంతా దాదాపు వెనకడుగు వేస్తున్నారు.