రాష్ట్రీయం

ఆదివాసీల ఆకాంక్షలు నెరవేరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 8: ఆదివాసీల ఆకాక్షలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడారం వచ్చారు. మొదట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్ సోమేష్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ములుగు ఇంచార్జీ కలెక్టర్ కర్ణన్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి నేరుగా మంత్రులతో కలిసి పట్టువస్త్రాలు, చీర, సారె శిరస్సున పెట్టుకుని అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. పూజారులు కాక సారయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నేరుగా అమ్మవార్ల వద్దకు వెళ్లి పసుపు, కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టిన అనంతరం పట్టువస్త్రాలను అమ్మవార్లకు అలంకరించారు. మంత్రులు వెంట ఉండి పూజారులతో కార్యక్రమాలన్నీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, పూజారులు మేడారానికి జాతీయ హోదా అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ జాతీయ హోదా అంశం ప్రధానమంత్రి నరేంద్రమోడి దృష్టిలో ఉందని, మరోసారి జాతర విశిష్టతను ప్రధానమంత్రికి వివరించి జాతీయ హోదా కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఇది గిరిజన జాతర కాదు ప్రజా జాతర అని, ఆదివాసీలు ఆర్థికంగా లేకున్నా సాంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆనందంగా జాతరలో పాల్గొంటున్నారన్నారు. త్వరలో గిరిజన జాతరకు జాతీయ పండుగ కళ సాకారం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరగడం, సకల సౌకర్యాలు కల్పించడం ఎంతో గొప్ప విషయమన్నారు. గత నెల రోజులుగా అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అధికార యంత్రాంగానికి పేరుపేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని, మరోసారి జాతరకు వస్తానని ఈ సందర్భంగా అన్నారు.