రాష్ట్రీయం

చట్టసభల తీరు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రస్తుతం చట్టసభలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. పార్లమెంట్ కావచ్చు, రాష్ట్రాల అసెంబ్లీ కావచ్చు. అంశాలపై చర్చను పక్కన పెట్టి రాజకీయంగా, వ్యక్తిగతంగా విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
విశాఖ గీతం డీమ్డ్ యూనివర్శిటీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ చట్టసభల్లో ఒకప్పటి హుందాతనం దాదాపు కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా కాకుండా శత్రువుల మాదిరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ఇక అసెంబ్లీలో కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోందని, ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులు మాట్లాడిన భాష కంపరం పుట్టించిందన్నారు. అయితే ఇది కేవలం ఏపీ అసెంబ్లీనే ఉద్దేశించి తాను చేస్తున్న వ్యాఖ్యలు కావన్నారు. చట్టసభల్లో ఒకప్పటి హుందాతనం కనుమరుగైందన్నారు. తిరిగి అటువంటి సహృద్భావ వాతావరణంలో చట్టసభలు జరగాలన్నారు. నేటి రాజకీయాల్లో కేస్ట్, కమ్యూనిటీ, కేష్, క్రిమినాలిటీ అర్హతలుగా మారిపోయాయన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ ఎంతో శక్తికలిగిందని, ఒక్క బుల్లెట్‌తో ఒక మనిషిని మాత్రమే చంపగలమని, ప్రధానులు, ముఖ్యమంత్రులను కూడా పదవి నుంచి దించగలిగే శక్తి బ్యాలెట్‌కు మాత్రమే ఉందన్నారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ బిల్లుపై రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు పలికారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న ప్రజల పౌరసత్వం రద్దు చేయాలన్నది సీఏఏ ఉద్దేశం కాదన్నారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌దేనన్నారు. ఇక ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, తదితర చట్టాల విషయంలో కూడా అవగాహన లేకుండా రాజకీయ పక్షాలు చర్చిస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తాత్కాలిక అంశంగా రాజ్యాంగంలో పొందుపరచిన జమ్ము-కశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఇంకా కొనసాగించడంలో అర్ధం లేదన్నారు.
తనకు మాతృభాషంటే ఎనలేని అభిమానమని, విద్యార్థుల మూలాలు మాతృభాషలోనే ఎదగాలని, అయితే పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఇతర భాషలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భారతీయ భాషలకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు