రాష్ట్రీయం

ఆదిలాబాద్-బెంగళూర్‌కు త్వరలో రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 10: ఎన్నో ఏళ్ళుగా ఆదిలాబాద్ జిల్లావాసులు ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ నుండి బెంగళూర్‌కు ప్రత్యేక రైలు సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుందని పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు తెలిపారు. ఈమేరకు ఢిల్లీ నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రస్తుతం నాందెడ్ నుండి బెంగళూర్‌కు నడుస్తున్న (16593) ప్రత్యేక ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదిలాబాద్ వరకు పొడిగించేలా కేంద్ర రైల్వే బోర్డు సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రజలతో పాటు పొరుగునే గల నాందెడ్ జిల్లా కిన్వట్, బోకర్ తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని తెలిపారు. కేంద్ర రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన పిమ్మట తనకు అధికారుల నుండి హామీ లభించిందని తెలిపారు. తాను కేంద్ర రైల్వే బోర్డుకు, దక్షిణమద్య రేల్వై అధికారులను పలుమార్లు కలిసి సమస్యలను విన్నవించగా ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర ప్రాంతాలకు రవాణా సంబంధాలు మెరుగుపర్చేందుకు సానుకూలంగా స్పందించారని, ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో రైల్వే స్థలం భారీ విస్తీర్ణంలో ఉన్నందున పిట్‌లైన్ ఏర్పాటు చేయాలని కోరగా ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, త్వరలోనే దక్షిణమధ్య రైల్వే జీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. పిట్‌లైన్ మంజూరైతే ఆదిలాబాద్ మిని రైల్వే జంక్షన్‌గా మారనుందని, ఆదిలాబాద్ నుండి కిన్వట్ మీదుగా నాందెడ్‌కు అదనంగా ప్యాసింజర్ రైలు త్వరలో రానుందని వివరించారు. ఆదిలాబాద్ నుండి అర్మూర్ వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని, అదే విధంగా రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు మంజూరైనా రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్ కింద నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు. త్వరలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌గోయల్‌ను కలిసి సమస్యలను మరోమారు విన్నవిస్తానని ఎంపీ సోయం బాపురావు వివరించారు.
*చిత్రం... ఎంపీ సోయం బాపురావు