రాష్ట్రీయం

సత్యసాయి సేవలు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఫిబ్రవరి 11: మానవాళికి భగవాన్ సత్యసాయిబాబా అందించిన సేవలు అద్భుతమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ అభివర్ణించారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయిబాబా మహాసమాధిని ధోనీ దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి విమానంలో వచ్చిన ధోనీ ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభా మందిరానికి చేరుకున్నారు. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్, ఇతర సభ్యులు ధోనికి స్వాగతం పలికారు. సత్యసాయి మహాసమాధి వద్ద పూలదండ ఉంచి ప్రణమిల్లి నమస్కరించారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు రత్నాకర్ ధోనిని శాలువాతో సత్కరించి సత్యసాయి చిత్రపటాన్ని బహూకరించారు. భగవాన్ బాబా అవతార విశిష్టతను ఆయన చూపిన ప్రేమ, శాంతి, సేవామార్గం, బాబా భౌతికంగా వున్న రోజుల్లో భక్తులకు ఇచ్చిన శాంతి సందేశాలను గురించి రత్నాకర్ ధోనికి వివరించారు. అనంతరం సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియాన్ని ధోనీ సందర్శించారు. అక్కడి నుండి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుని సిమ్స్ డైరెక్టర్ గురుమూర్తితో మాట్లాడారు. వెల కట్టలేని వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న తీరు గురించి తెలుసుకున్నారు. పుట్టపర్తి చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

*చిత్రం...పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటున్న ధోనీ