రాష్ట్రీయం

విధ్వంసకర నిరసనలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) అంశాలపై దేశ వ్యాప్తంగా నిర్మాణాత్మకంగా, కూలంకషంగా చర్చ జరగాలని, ప్రజలు కూడా వీటిపై లోతుగా అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఇక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి మాట్లాడుతూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై ప్రజలకు సంపూర్ణ అవగాహన
కల్పించాలన్నారు. ఈ అంశాలను అర్థం చేసుకోకుండా తొందరపడి ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. భారతదేశం పరిణితి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థకు నిదర్శనమన్నారు. అసమ్మతి ఏమైనా ఉంటే నిర్మాణాత్మకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తెలియజేయాలన్నారు. సంక్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కూడా సంయమనం పాటించాలని మహాత్మాగాంధీ చెప్పేవారన్నారు. పార్లమెంటు, చట్టసభల హుందాతనాన్ని కాపాడాల్నారు. వ్యక్తిగత దాడులు, రాజకీయ సిద్ధాంతాలపై రచ్చ చేయడం తగదన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రాజకీయ దురంధరుడు, రాజనీతిజ్ఞుడు అని ఉప రాష్ట్రపతి నివాళులు అర్పించారు. చెన్నారెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శాసనసభ లోపల, వెలుపల ప్రజాప్రతినిధులతో, ప్రజలతో చెన్నారెడ్డి చక్కగా వ్యవహరించేవారన్నారు. ప్రభుత్వపరంగా తీవ్రమైన విమర్శలు చేసినా అందులోని అంతరార్థాన్ని స్వీకరించేవారన్నారు. గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ చెన్నారెడ్డికి ఉండేవన్నారు. తాను, దివంగత నేత ఎస్ జైపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మర్రి చెన్నారెడ్డి ఎంతో ఆసక్తిగా వినేవారన్నారు. వయస్సులో, అనుభవంలో చిన్నవారిమైనా, తాము ఇచ్చే సలహాలు, సూచనలను ఆయన స్వీకరించేవారన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి అసాధారణ ప్రతిభాశీలి అని ఆయన ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పోషించిన పాత్ర కీలకమన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చినందున వ్యవసాయం అంటే ఆయన ప్రాణమన్నారు. అన్నదాతలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకునేవారని ఆయన గుర్తు చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా ప్రసంగించేవారన్నారు. అందుకే జననేతగా చెన్నారెడ్డిని ప్రజలు ఆరాధించేవారన్నారు. మంచి రచయిత కూడా అయిన చెన్నారెడ్డి నిజాం పాలనలో విజయవాడ నుంచి ప్రచురితమయ్యే హైదరాబాద్ అనే పత్రిక ద్వారా ప్రతిభావంతమైన రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించేవారన్నారు. భూసంస్కరణలు, బీసీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడం, సెట్విన్ సంస్థ రూపకల్పన, గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించడం తదితర విషయాల్లో చెన్నారెడ్డి తీసుకున్న చొరవ మరువలేనిదన్నారు. చెన్నారెడ్డి అంటే తెలంగాణ, తెలంగాణ అంటే చెన్నారెడ్డి అనే గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. అసలు సిసలైన ప్రజాస్వామ్యవాది చెన్నారెడ్డి అని, తెలుగువారు గర్వించదగిన మహానాయకుడు అని ఆయన అన్నారు.
మర్రి చెన్నారెడ్డి ట్రస్టు తరఫున జాతీయ అవార్డును తెలుగువాడైన దివంగత నీటి పారుదల రంగ నిపుణుడు హనుమంతరావుకు (మరణానంతరం) అందజేయడం సముచితంగా భావిస్తున్నట్లు ఉప రాష్ట్రపతి చెప్పారు. హనుమంతరావు కుమారుడు విజయ్‌కుమార్‌కు ఈ అవార్డును ఈ సందర్భంగా ప్రదానం చేశారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్రి చెన్నారెడ్డితో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి చెన్నారెడ్డి శ్రీకారం చుట్టారని, గొప్ప ప్రతిభాశీలి అని నివాళులు అర్పించారు. శ్రీరామ్‌సాగర్ కట్టి తెలంగాణను దుర్భిక్షం నుంచి కాపాడిన నేత అన్నారు. ట్రస్టు కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి, పలువురు నేతలు ఈ సభలో పాల్గొన్నారు.

'చిత్రం... హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం నీటి పారుదల రంగ నిపుణుడు దివంగత హనుమంతరావు కుమారుడు విజయ్‌కుమార్‌కు మర్రి చెన్నారెడ్డి ట్రస్టు తరఫున జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు