రాష్ట్రీయం

సీఏఏ భారత ప్రజల కోసం ఉద్దేశించిన చట్టం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 30:పౌరసత్వ చట్టం భారతప్రజల కోసం ఉద్దేశించింది కాదని, కేవలం పొరుగు దేశాలనుండి వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వటం కోసం మాత్రమేనని బీజెపీ రాజ్యసభసభ్యుడు జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు. సోమవారం ఒంగోలులో పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి భారీ ప్రజాచైతన్య ప్రారంభమైంది. ఈయాత్రను జీవీఎల్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్‌డీఒ కార్యాలయ ప్రాంగణంలోని ఎన్‌టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారతీయజనతాపార్టీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ బిల్లును సమర్ధిస్తూ ప్రజాచైతన్యయాత్రలు చేపట్టిందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలోని కొన్ని రాజకీయపార్టీలు ఆరాచకాలు సృష్టించి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. ఈ అంశాన్ని గత ప్రభుత్వాలు పేర్కొన్నప్పటికీ చట్టం రూపు దాల్చలేదన్నారు. ఏడు దశాబ్ధాలుగా నేరవేరని ఆకాంక్షను పూర్తిచేసిన ఘనత దేశప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. ఈ చట్టం పౌరసత్వాన్ని ఇచ్చేది కాని భారతదేశంలో పుట్టిపెరిగిన వారి పౌరసత్వాన్ని తొలగించేది కాదన్నారు. ఈచట్టం కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఘ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన క్రైస్తవ, హిందూ, ఇతర మైనార్టీ మతాలకు సంబంధించి ఏ పౌరులైతే వివిక్షకు గురై దేశంలోకి వచ్చి శరణు కోరిన వారికి పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం అన్నారు.