రాష్ట్రీయం

క్యాపిటల్ రీజియన్ ప్లాన్‌కు సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికకు తుది రూపాన్నిచ్చేందుకు అటు సింగపూర్ బృందం ఇటు సిఆర్‌డిఎ సిబ్బంది విస్తృత కసరత్తు చేస్తున్నారు. బృహత్ ప్రణాళిక నమూనాను ప్రకటించిన ప్రభుత్వం దానిపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించింది. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను క్రోడీకరించిన అధికారులు తదనుగుణంగా బృహత్ ప్రణాళికలో మార్పులు చేస్తున్నారు.
రాజధానిలో కొన్ని గ్రామాల మీదుగా రహదార్లు వెళ్లడంపై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ మరోమారు సుర్బానా బృందం దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు ప్రణాళికలో మార్పులకు సిద్ధమయ్యారు. వాస్తవానికి సీడ్ క్యాపిటల్‌లో మార్పులు సహజంగానే రాజధాని నిర్మాణం పూర్తయ్యేంత వరకూ జరుగుతునే ఉంటాయని ఒక సీనియర్ అధికారి వివరించారు. సీడ్ క్యాపిటల్‌కు మొత్తం 4227 ఎకరాలను కేటాయిస్తారు. ఇందులో వివిధ నిర్మాణాలకు 2861 ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు కేటాయిస్తారు. ప్రభుత్వ పరిపాలనా భవనాలకు 150 ఎకరాలను ఏకటాయిస్తున్నారు. బిజినెస్ పార్కులు, వాణిజ్య అవసరాలు, ప్రత్యేక అభివృద్ధి జోన్, మిశ్రమ వినియోగం తదితర రంగాలకు 2861 ఎకరాలను కేటాయించనున్నారు.
క్యాపిటల్ ప్రాంతంలో విశాలమైన రోడ్లను నిర్మించేందుకు 639 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. అలాగే రోడ్ల విస్తరణకు కూడా మరో 693 ఎకరాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. సింగపూర్ సుర్బానా గ్రూప్ ప్రణాళిక అనుసరించి విజయవాడ నుండి అమరావతికి, మంగళగిరి నుండి అమరావతికి 88 కిలోమీటర్లు మేర ఐదు కేటగిరిలుగా రోడ్లను నిర్మిస్తారు. రాజధాని పరిధిలోని 25 గ్రామాలను ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేసి, ప్రతి గ్రామాన్ని నగరాలుగా అభివృద్ధి చేస్తారు. ప్రతి గ్రామంలో వౌలిక సదుపాయాలను కల్పిస్తారు. కాగా తొలి దశలో 901.93 ఎకరాలను విస్తరిస్తారు. ప్రధానమైన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు, కీలకమైన ప్రభుత్వ పరిపాలనా కేంద్రం తొలి దశలోనే నిర్మించనున్నారు. సిబ్బంది కోసం 26వేల నివాస గృహాలు అందుబాటులోకి వస్తాయి. లింగాయపాలెం గ్రామం పరిధిలో ఈ భవనాల నిర్మాణం జరగనుంది. సచివాలయం, శాసనసభ, హైకోర్టు, పౌర పరిపాలనా కేంద్రాలు మొదటిదశ సీడ్ క్యాపిటల్‌లో అత్యంత ముఖ్యమైనవి. వీటితో పాటు అభివృద్ధి కారిడార్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు దశల వారీ ఏర్పాటు చేస్తారు.