రాష్ట్రీయం

సేవాతత్పరుడు సత్యసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్
ఘనంగా సత్యసాయి 90వ జయంతి వేడుకలు

పుట్టపర్తి, నవంబర్ 23: సేవాతత్పరుడు సత్యసాయి అని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొనియాడారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం జరిగిన సత్యసాయి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ భగవాన్ సత్యసాయితో తనకున్న అనుబంధాన్ని, మానవాళికి ఆయన చేసిన సేవల గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా విద్య, వైద్యం, తాగునీరు వంటి ఎన్నో సేవలను ప్రసాదించి మానవాళిని సన్మార్గంలో నడిపిన అవతార మూర్తి సత్యసాయి అని అన్నారు. తాను 45 ఏళ్ల క్రితం పోలీసు అధికారిగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసినప్పటి నుండి బాబాకు అమిత భక్తుడినన్నారు. మానవీయ విలువలను పాటించి ఐక్యత, సఖ్యత, ఆధ్యాత్మికత, మంచి ఆలోచనలతో మనిషి సుఖశాంతులతో జీవించాలని బాబా చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు. భక్తి, జ్ఞానం, కర్మయోగం వేరుకాదన్నారు. సత్యసాయి ప్రవేశపెట్టిన విద్యావాహిని భారతదేశాన్ని ముందుకు నడపడమే కాక ప్రపంచం నలుమూలలకు వ్యాపిస్తోందన్నారు. విద్యావాహిని ఆవశ్యకత, విద్యావిధానం మంచికి మంచిని నేర్పి సన్మార్గంలో నడుపుతోందన్నారు.
సత్యసాయి ట్రస్టుసభ్యులు నాగానంద మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్ని వేల మంది భక్తులను ఆహ్వానం పంపకనే వీరంతా జయంత్యోత్సవాల్లో పాలుపంచుకోవడం అంటే అదే సత్యసాయి స్వర్ణయుగమన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచ నలుమూలలా విశిష్ట సేవలందిస్తున్నాయన్నారు. మద్రాసు శ్రీనివాసులు మాట్లాడుతూ సత్యసాయి బాబా అవతారం చాలించి ట్రస్టు బాధ్యతలను తమకు అప్పజెప్పారన్నారు. 2011 నుండి సత్యసాయి ట్రస్టు యథావిధిగా సేవలను కొనసాగిస్తోందన్నారు. ట్రస్టు పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. బాబా జయంతి ఉత్సవాల సందర్భంగా వార్షిక నివేదికను విడుదల చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నివేదికను అందజేస్తున్నామన్నారు. ఈసారి సత్యసాయి ట్రస్టు సుమారు రూ.40కోట్లు ఖర్చు చేసి వైద్యం, తాగునీరు, వివిధ సేవా పథకాలను నిర్వహించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌టిఆర్ సుజల స్రవంతి పథకంలో సైతం సత్యసాయి సేవా ట్రస్టు భాగస్వామ్యం నిర్వహించి సేవలు అందిస్తోందన్నారు.
కన్నుల పండువగా బాబా జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 90వ జయంత్యోత్సవాలు పుట్టపర్తిలో సోమవారం ఘనంగా జరిగాయి. సుమారు 180 దేశాలకు చెందిన సత్యసాయి భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సోమవారం ఉదయం సత్యసాయి చిత్రపటాన్ని స్వర్ణరథంపై ఉంచి ఊరేగించారు. రోడ్లకిరువైపుల నిలుచున్న భక్తులు బాబాను దర్శించుకుని పునీతులయ్యారు. స్వర్ణరథం హిల్‌వ్యూ స్టేడియంలోకి చేరుకోగానే హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించారు. హ్యాపీ బర్త్‌డే టు యూ సాయి అంటూ సత్యసాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సత్యసాయి ఆశీనులయ్యే కుర్చీ వద్ద ప్రముఖులు ప్రణమిళ్లి భక్త్భివాన్ని చాటుకున్నారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఎమ్మెల్యే యామినిబాల, తెలంగాణ ఎమ్మెల్యే గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చిత్రం)సత్యసాయి చిత్రపటాన్ని స్వర్ణరథంపై ఊరేగిస్తున్న దృశ్యం