రాష్ట్రీయం

విసిల నియామకానికి సెర్చి కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సెర్చ్ కమిటీకి ముగ్గురితో కూడిన ప్యానల్‌ను ప్రభుత్వం నియమించింది. జెఎన్‌టియుకి ఒయు మాజీ వైస్ చాన్సలర్ ప్రొ.టి.తిరుపతిరావు, యుజిసి సభ్యుడు డాక్టర్ విఎస్ చౌహాన్, తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యతో సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెర్చ్ కమిటీలో ఒయు మాజీ వైస్‌చాన్సలర్ సులేమాన్ సిద్ధిఖీ, ఇగ్నూ మాజీ వైస్ చాన్సలర్ ప్రొ.హెచ్.పి దీక్షిత్, తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావులను నియమించింది. కాకతీయ విశ్వవిద్యాలయానికి డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొ.వి.ఎస్.ప్రసాద్, భారతి విద్యాపీఠ్ వైస్ చాన్సలర్ ప్రొ.శివాజీరావ్ కడమ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలను సెర్చ్‌కమిటీలో నియమించింది. పాలమూరు విశ్వవిద్యాలయానికి సెర్చ్ కమిటీలో ఎపి ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పి.జయప్రకాశ్‌రావు, యుజిసి సభ్యుడు డాక్టర్ విఎస్ చౌహాన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలను నియమించింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సెర్చ్‌కమిటీకి ఒయు మాజీ వైస్‌చాన్సలర్ ప్రొ.టి.తిరుపతిరావు, యుజిసి వైస్ చైర్మన్ ప్రొ.హెచ్.దేవరాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలను నియమితులు కాగా, నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్శిటీకి కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ విసి ప్రొ.ఎన్.లింగమూర్తి, కలకత్తా యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ ప్రొ.సురంజన్ దాస్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలను సెర్చ్ కమిటీలో నియమించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సెర్చ్ కమిటీకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ మాజీ వైస్‌చాన్సలర్ ప్రొ.వి.ఎస్.ప్రసాద్, ఇగ్నూ మాజీ విసి ప్రొ.హెచ్.పి దీక్షిత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావులను నియమించింది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సెర్చ్‌కమిటీలో ఎపి ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పి.జయప్రకాశరావు, హర్యానా సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ఆర్.సి.కుహద్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యలను నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. ఈ సెర్చ్ కమిటీలన్నీ ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్‌ను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.