డైలీ సీరియల్

యమహాపురి - 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం డ్రాయింగ్ రూంలో ఎవరూ లేరు. కానీ ఇంట్లో మనుషులున్నారనడానికి సూచనగా మాటలు కాస్త హెచ్చు స్వరంలోనే వినవస్తున్నాయి. ఆ మాటలని అనుసరించి వెడితే- అది మాస్టర్ బెడ్రూం.
ప్రస్తుతం మిస్టరూ, మిసెస్సూ, మిస్సూ అంతా అక్కడే ఉన్నారు.
‘‘నాన్నా, నా జెల్ పెన్ కనిపించడం లేదు’’ అన్నాడు ఏడేళ్ల వర్థన్.
‘‘నాన్నా! నా క్రేయాన్స్ కనబడ్డం లేదు’’ అంది ఐదేళ్ళ మిత్ర.
‘‘ఏమండీ! మిక్సీ జార్ మూత కనబడ్టం లేదు’’ అంది పాతికేళ్ల వసంత.
‘‘అబ్బ! ఇంటా బయటా కూడా వెతికి పట్టుకునే డ్యూటీయేనా నాకు? ఇంట్లోనైనా కాస్త రిలీఫివ్వరా?’’ అన్నాడు ముప్పయేళ్ళ శ్రీకర్ తల పట్టుకుని.
‘‘దేనికైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి’’ అంది వసంత వెంటనే.
‘‘ఔను. అమ్మ కరెక్ట్! నానే్న మా వస్తువులు మాకు వెదికివ్వాలి’’ అన్నారు పిల్లలిద్దరూ.
‘‘సరే- అలాగే! ప్రస్తుతం అద్దం ముందు నిలబడితే నాకు నేనే కనబడ్డం లేదు. నన్ను నాకు వెదికి పెట్టండి. మీవి నేను వెతికిపెడతాను’’ అంటూ వెళ్లి పక్కనున్న కింగ్ సైజ్ బెడ్‌మీద చతికిలబడ్డాడు శ్రీకర్.
అప్పుడు వసంత కళ్లు డ్రెస్సింగ్ టేబుల్ వైపు తిరిగాయి. ఆమె నాలిక్కరుచుకుని, ‘‘అయ్యో! పొద్దున్న ఇల్లు సద్దుతూ పనిమనిషి సాయంతో- డ్రెస్సింగ్ టేబుల్ అటు తిప్పాను. మళ్లీ ఇటు తిప్పడం మర్చిపోయినట్లున్నాను’’ అని అటు వెళ్లింది.
‘‘ఆహాహా- పొద్దున్నించి ఈ క్షణందాకా- డ్రెస్సింగ్ టేబుల్ అవసరమే రాలేదు నీకు. గ్రేట్! నీ సహజ సౌందర్యం మీద నీకెంత నమ్మకం?’’ నవ్వాడు శ్రీకర్.
వసంత ఏదో అనబోయి తననే చూస్తున్న పిల్లల్ని చూసి తటపటాయించి, ‘‘దీనికి జవాబు ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను’’ అంది. ఆమె టేబుల్ కదపబోతే అతి కష్టంమీద కొంచెం కదిలింది.
‘‘అలా చూస్తూ నిలబడతారేం? వెళ్లి అమ్మకి సాయం చెయ్యండి’’ పిల్లల్ని గద్దించాడు శ్రీకర్.
‘‘అమ్మకే కదలని టేబుల్ని కదపడం- పిల్లలం, మావల్లనౌతుందా? అలా చూస్తూ కూర్చునే బదులు- సాయానికి నువ్వెడితే బాగుంటుంది’’ అన్నాడు వర్థన్.
శ్రీకర్ లేవనేలేదు. ‘‘చెప్పానుగా, నాకు నేను కనబడేదాకా, నేనెవ్వరికీ సాయపడలేను. మీరే వెళ్లండి. అమ్మకి సాయపడండి. మీ శక్తి మీకు తెలియదు. మీరు ముగ్గురూ కలిస్తే- ఆ టేబులేమిటి- ఈ ఇంటి పునాదులే కదపగలరు. కానీ పునాదుల జోలికి వెళ్లకండి. ఇప్పటికి టేబులొక్కటే కదపండి’’ అని ఇంకా ఏదో అనబోతూండగా పిల్లల సాయం లేకుండానే వసంత టేబుల్ని కాస్త ముందుకి లాగింది. బర్రుమని చప్పుడైంది.
‘‘వెరీ గుడ్! ఇప్పుడు అంతా కలిసి టేబుల్ని అటు తిప్పండి’’ అన్నాడు శ్రీకర్.
టేబుల్ని అటు తిప్పడానికి ప్రయత్నిస్తున్న వసంతకి- ఆ మాట వినగానే ఉక్రోషం వచ్చింది. ‘‘ఆడాళ్లనంటారు కానీ- మీ మగాళ్ల షోకులముందు మావెంత? ఇప్పుడు బల్ల వెనకాల మనిషి పట్టే చోటొచ్చింది. వచ్చి ఇట్నించి అద్దంలో చూసుకుని, మీకు మీరు కనిపించేక- కావాల్సిన షోకులు చేసుకోండి. తర్వాత టేబుల్నిటు తిప్పండి. ఇది మా వల్ల అయ్యే పని కాదు’’ అంది.
‘‘దేన్నయినా తెగేదాకా లాగకూడదులే’’ అంటూ శ్రీకర్ లేచి అటు వెళ్లాడు. అద్దంలో తనని తాను చూసుకున్నాడు. ‘‘ఔరా! శ్రీకరూ! ఎంత అందంరా నీది- ననే్న పరవశింపజేస్తోంది!’’ అని ముచ్చటపడ్డాడు.
ఇలాంటి డైలాగ్స్ ఆ ఇంట్లో మామూలే! అందుకే పిల్లలు తమలో తాము ముసి ముసి నవ్వుకున్నారు.
వసంత కూడా సన్నగా నవ్వి, ‘‘నిజంగా అందగాడైతే ఇంకెంత పరవశించిపోయేవారో మీ నాన్న!’’ అంది.
శ్రీకర్ అక్కడే నిలబడి తల దువ్వుకున్నాడు. షర్టు సరిచేసుకున్నాడు. టేబుల్ మాత్రం కదపలేదు.
‘‘చాకిరొకరిది, సౌఖ్యమొకరిది ఐతే ఇక సాగదని తెలుసుకోండి. ఎవరైతే దీన్ని కదిపారో, వాళ్లే మళ్లీ దీన్ని యథాస్థానంలో ఉంచాలి అంటే- రేపు పనిమనిషి వచ్చేదాకా- ఇక్కడ ఇదిలాగే ఉంటుంది’’ అన్నాడు.
వసంత వెంటనే, ‘‘ఒక నెల్లాళ్లపాటు పనిమనిషికి వేరే పనులున్నాయి. సెల్ఫ్ హెల్ప్‌కి సిద్దపడకపోతే- ఆ నెల్లాళ్లూ అద్దం చూసుకుందుకు ఇదే మార్గం’’ అంది.
‘‘మమత పరిబొర్తన్ అంది. మోదీ బద్‌లావ్ అన్నాడు. బాబు మార్పు అన్నాడు. నా ఓటు కూడా మార్పుకే. ఫరేఛేంజ్ కొన్నాళ్లపాటు డ్రెస్సింగ్ టేబుల్ని ఇలాగే వాడదాం. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. మీరూ ఓ ట్రయల్ వేసి చూడండి’’ అంటూ తను బైటికి వచ్చాడు శ్రీకర్.
పిల్లలకిది నచ్చింది. వెంటనే హుషారుగా టేబుల్ వెనక్కి వెళ్లారు. అద్దంలో చూసుకుని, ‘‘ఇలా చాలా బాగుందమ్మా! ఇకమీదట దీన్నిలాగే వాడదాం. ఈ టేబుల్ పొజిషన్ మార్చొద్దు’’ అన్నారు.
వసంత ముఖంలో ముచ్చటతో కూడిన విసుగు, ‘‘మీరొకళ్లు! నానే్నమంటే దానికి తందానతాన. మీకిలాంటి తిరకాసు పద్ధతి బాగుండే మాటైతే- నాదింకో ప్రపోజలుంది వినండి. ఈ రాత్రి నుంచి మనం డైనింగ్ టేబుల్ మీద కాదు, క్రింద కూర్చుని భోంచేద్దాం. సరేనా?’’ అంది. పిల్లలు మరింత హుషారెక్కారు.
‘‘్భలే భలే- లెజెండ్‌లో బ్రహ్మానందానికిలా థ్రిల్’’ అన్నాడు వర్థన్.
‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎమ్మెస్ నారాయణకిలా చాలా పెద్ద థ్రిల్’’ అంది మిత్ర.
‘‘ఆ థ్రిల్ కోసం రాత్రయ్యేదాకా ఆగాలి. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే మిమ్మల్ని థ్రిల్ చేస్తాను. ఒకసారి కిందకి చూడండి’’ అన్నాడు శ్రీకర్.
పిల్లలు కిందకి చూశారు. వెంటనే, ‘‘అమ్మా! నా జెల్ పెన్’’ అన్నాడు వర్థన్.
‘‘అమ్మా! నా క్రేయాన్స్’’ అంది మిత్ర.
‘‘ఇదిగో, నీ మిక్సీ జార్ మూత కూడా ఇక్కడుంది’’ అన్నారిద్దరూ ఏకకంఠంతో.
‘‘పోయిన మీ వస్తువులు మీ చేతనే వెదికించాను చూశారా- అదీ పోలీసోడి తెలివంటే!’’ అన్నాడు శ్రీకర్.
వసంత మూతి మూడు వంకర్లు తిప్పి ‘స్టేషన్లో లాఠీని అదేపనిగా తిప్పుతారు.

ఇంకా ఉంది

వసుంధర