డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనం ఒకరి గురించి మరొకరికి వివరంగా చెప్పుకోకపోయినా మన మధ్య భావసారూప్యత ఉండటంతోపాటు మన నిత్య జీవితంలోని అసంతృప్తులు కూడా మనమిలా కల్సుకుందుకు చాలావరకూ కారణమేమో!’’ అంది సాహిత్య.
‘‘మీ వారూ..’’ అని ఆగిపోయాడు సామ్రాట్.
‘‘నా సంసార జీవితం గురించి మీతో చెప్పుకుందుకు నేనేవీ సిగ్గుపడడంలేదు. మావారు సమాజంలో హోదాగల ఉద్యోగమే చేస్తున్నారు..’’ అని ఒక్క క్షణం ఆగి ‘‘జంతువులకూ, మనుషులకూ ఉన్న వౌలికమైన తేడా ఏవిటో చెప్పగలరా మీరు?’’ అంది సాహిత్య.
ఆమె ఏదో చెప్పబోతోందని ఆసక్తిగా చెవులు రిక్కించిన సామ్రాట్, ఉపోద్ఘాతం కూడా ఇంకా పూర్తికాకుండానే ఆమె వేసిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలోననే ఆలోచనలో పడిపోయాడు.
ఒక్క క్షణం ఆలోచించి, ‘‘మనుషులకు అవసరాలతోపాటు కోరికలు, భావాలు వుంటాయి. జంతువులకు అవసరాలు మాత్రమే వుంటాయి. ఒకవేళ వాటికి భావాలు ఉన్నా అవి భౌతిక అవసరాలకు సంబంధించినవి మాత్రమే అయి ఉంటాయి’’ అన్నాడు సామ్రాట్ తను చెప్పింది తప్పా, ఒప్పా? అన్నట్టు ఆమె వైపు చూస్తూ.
అతణ్ణి మెచ్చుకోలుగా చూస్తూ, ‘‘సరిగా చెప్పారు. మావారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఫీలింగ్స్ తక్కువా, ఇన్‌స్టింక్ట్స్ ఎక్కువగా ఉన్న ఒకానొక సజీవ రూపం ఆయన’’ అందామె.
‘‘అంటే.. అంటే..’’ అన్నాడు సామ్రాట్.
‘‘వివరంగా చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. వెనె్నల్లో ఆరుబయట కట్టుకున్నవాడితో చేరుూ చేరుూ కలుపుకుని విహారానికెళ్లడం నాకిష్టం. అది వెనె్నల రాత్రి అయినా, చీకటిరాత్రి అయినా నాలుగు గోడల మధ్య కాలం గడిచిపోతే చాలు ఆయనకు.
ఊహల్లో విహరించడం నాకిష్టం. ఊహలకూ ఆయనకూ ఆమడదూరం. నేను ఆయన్తో కలిసి గడిపే సమయంలో ఎక్కువసేపు మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. సంభాషణలు ఆయనకు కిట్టవు.
భౌతికపరమైన విషయాలపట్ల ఆయనకెంత ఆసక్తో, మనస్సుకు సంబంధించిన విషయాలంటే నాకంత అనురక్తి. మాంసాహారం అంటే నాకు సరిపడదు. శాకాహారం తినేవాళ్లు ఆయన దృష్టిలో మనుషులే కాదు. అటువంటివారి నాయన గడ్డితిని పొట్టనింపుకునే జంతువులతో పోలుస్తారు.
జంతువుల్లో నాకు అమాయకంగా ఉండే కుందేలంటే ఇష్టం. ఆయనకు క్రూర జంతువు పులి అంటే తగని మక్కువ.
‘‘ఎంత అనాకారి స్ర్తి అయినా చీరా, జాకెట్‌లోనే ఎంతో కొంత అందంగా కనిపిస్తుందో’’ని నేనంటే, ‘‘టైట్ జీన్స్‌లోనూ, ఒంటినంటిపెట్టుకున్నట్టుగా ఉండే నానా రకాల కొత్త కొత్త ఫాషన్ దుస్తులలోనే ఆడవాళ్ల అసలు అందం చూడాలంటా’’రాయన.
‘కనీస సౌకర్యాల అవసరం తీరేంత డబ్బు సంపాదిస్తే చాల’ని నేనంటే, ‘డబ్బు విలువ నీకేం తెలుసం’టారు. బంగారంపట్ల మోజుపడే ఆడవారి గురించి నిరసనగా నేను మాట్లాడితే, ‘బంగారాన్ని ఇష్టపడని మనిషినసలు ఆడదానిగా గుర్తించాల్సిన అవసరం లేదంటా’రాయన.
ఏడాదికో, ఆర్నెల్లకో ఎప్పుడైనా నలుగురూ మెచ్చిన సినిమా చూసేందుకు వెళదామని నేనంటే- ‘ఎంత గొప్ప సినిమా అయినా మనకు తెలియని భాగోతం అందులో ఏముంటుందిలే!’ అంటారు.
మొదట్లో ‘నేను ఉద్యోగం చేస్తానంటే ఒహపట్టాన ఒప్పుకోలేదాయన. నువ్వు సంపాదించకపోతే ఇల్లు గడవదా? అని వెటకారం చేసి చివరకు నా బలవంతంమీద తనకిష్టం లేకపోయినా ‘పోనీలే.. అలా అయినా నీకు లోకం తీరు కొంత అర్థమవుతుంద’ని నన్ను ఉద్యోగం చేసుకుందుకు అనుమతించారు.
‘ఈరోజు ఇద్దరమూ సరదాగా కలిసి బయట తిరిగొద్దాం’ అని మా పెళ్లయిన తొలి సంవత్సరం వచ్చిన ఆయన పుట్టినరోజు నాడు అంటే ‘‘ఏం మున్ముందు మనం కలిసి బయట తిరగడానికి రోజులే ఉండవా?’ అని హాస్యమాడారు.
ఇంట్లో కిటికీ తలుపులు తెరిస్తే నాకిష్టం. మూస్తే ఆయనకిష్టం. నాకు మామూలు ఆకుకూరలిష్టం. ఆయనకు పొగాకు మాత్రమే ఇష్టం. నాకు ఏలకులంటే ఇష్టం. ఆయనకు లవంగాల ఘాటంటే ఇష్టం.
ఉదయానే్న కాఫీతోపాటు న్యూస్‌పేపర్‌ను ఫలహారంగా భుజించడం ఆయనకిష్టం. కథలూ, నవలల ప్రసక్తి వస్తే ఆయన మొహం చేదు తిన్నట్టుగా అయిపోతుంది. నాకు కారం అంటే ఇష్టమైతే ఆయనకు తీపి అంటే ప్రాణం.
మగవాళ్లూ, ఆడవాళ్లూ ఇద్దరూ సమానమే అని నేనంటే, ఆడదాని పుట్టుకకు అర్థం మగాణ్ణి సంతోషపెట్టడం తప్ప మరొకటి కాదంటారాయన.
భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలనొకరు గౌరవించుకున్నపుడే సంసారం సుఖవంతంగా ఉంటుందని నేనంటే, ఎవరి అభిప్రాయాలను వారు గౌరవించుకుంటే చాలంటారాయన.
మామధ్య ఇన్ని వైరుధ్యాలున్నా ఆయనలో ఉన్న గొప్ప సుగుణం ఏవిటంటే, నాలో తనకు నచ్చని విషయాలున్నా, సూచనప్రాయంగా చెప్పి ఊరుకుంటారే తప్ప చాలామంది మగవాళ్లలా నన్ను సాధించరు. ఆ రకంగా నేను అదృష్టవంతురాల్నే.
కానీ చిన్నప్పటినుంచి వైవాహిక జీవితం ‘ఇలా’ ఉండాలనే ఊహలతో పెరుగుతూ వచ్చాను కాబట్టి మనసుకు సంబంధించిన చిన్న చిన్న కోరికలూ, అనుభూతులూ కూడా తీరడం లేదే! ఈ జన్మకింతేనా? అని అప్పుడప్పుడూ విచారం కలుగుతూ ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా ఎన్ని విషయాలైనా చెప్పొచ్చు’’ అంటూ ముగించింది సాహిత్య.
ఆమె చెప్పిన విషయాలు నోరు మెదపకుండా ఎంతో శ్రద్ధగా విన్న సామ్రాట్‌కు అనిపించింది. ‘ఏవిటీ జీవితాలు?’ పరస్పర విరుద్ధమైన భావాలూ, అభిప్రాయాలూ కలవాళ్లే భార్యాభర్తలెందుకవుతారని.
తాను చెప్పినదంతా విన్నాక అతడేమీ మాట్లాడకుండా ఆలోచనలో పడడం చూసి అంది సాహిత్య. ‘‘ఏవిటలా వౌనంగా ఉండిపోయారు?’’ మీ శ్రీమతి గుర్తొచ్చారా?!’’

-ఇంకాఉంది

సీతాసత్య