డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవ్వ పేరే ముసలమ్మ అబ్బాయిగారూ! ఇంతకుముందు మీరన్నారే.. భార్యాభర్తలు ఒకరి మనసులోకి మరొకరు పరకాయ ప్రవేశం చేయాలని. చెప్పాలంటే స్నేహం మాత్రమే చేస్తున్నామనే భ్రమలో.. మీరిప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నారు.
నా అంచనా నిజమైతే.. మీరు స్నేహమనుకుంటున్న మీ పరిచయం మున్ముందు ప్రేమగా రూపాంతరం చెంది అతి త్వరలోనే మీరూహించని మలుపులు తిరిగే అవకాశం నా కళ్లక్కట్టినట్టుగా గోచరిస్తోంది’’ అన్నాడు గౌతమ్.
‘‘మావాణ్ణి మరీ అంతలా బెదరగొట్టేయకండి గౌతమ్‌గారూ.. మావాడసలే భయస్తుడు కూడానూ!’’
వాళ్లిద్దరి మాటలు వింటూ అప్పటివరకూ వౌనంగా ఉన్న మహర్షి అన్నాడు, విషయాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తూ.
‘‘అలా అయితే మరీ కష్టం! ప్రేమించే వాళ్లకు పిరికితనం అస్సలు పనికిరాదు’’ అన్నాడు గౌతమ్.
‘‘నేనేదో సరదాగా అంటే మీరు మరీ ఆట పట్టిస్తున్నారు మా వాణ్ణి. మరీ అంత నోట్లో నాలుకలేని వాడుకాదులెండి మావాడు. అవసరమైతే ధైర్యంగా ఎదురు నిలిచి పోరాడే సత్తా కూడా లేకపోలేదు.
వాడి పేరు సామ్రాట్ అనే విషయం మరిచిపోతున్నట్టున్నారు మీరు’’ అన్నాడు మహర్షి.
‘‘మరింకేం.. అంతా శుభమే జరుగుతుంది. ఇహ దిగులు పడకండి సామ్రాట్‌గారూ.. ముందుగా మీకు ఇవే నా అభినందనలు!’’ అన్నాడు గౌతమ్.
9
‘‘సామ్రాట్.. నీతో ఒక విషయం చెప్పాలి’’ అంది సాహిత్య.
‘‘అరే.. నేనూ నీతో ఒక విషయం చెప్పాలనే మనిద్దరం ఈ రోజు తప్పకుండా కల్సుకోవాలని అన్నాను’’ అన్నాడు సామ్రాట్.
‘‘సరే.. ముందుగా నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా?’’ అంది సాహిత్య.
‘‘ఆడవాళ్లే ముందు అనే లోకోక్తి ఉండనే ఉంది కనుక నువ్వే ముందు చెప్పు’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహూ.. నావరకూ నువ్వే ఫస్ట్ కాబట్టి నువ్వే చెప్పు’’ అంది సాహిత్య, అతడు చెప్పబోయే విషయం ఏమై వుంటుందా? అని ఆలోచిస్తూ.
‘‘మొన్న మనిద్దరం వేణుగోపాలస్వామి గుడి దగ్గర కల్సుకున్న విషయానికి మసాలా అద్ది ఎవరో మా ఆవిడకు రుచి చూపించారు’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఈరోజు కాకపోతే రేపైనా ఈ విషయం మీ ఆవిడకు తెలుస్తుందనుకున్నానుగానీ మరీ ఇంత త్వరగా తెలుస్తుందనుకోలేదు’’ అంది సాహిత్య.
తానాశించిన స్పందన ఆమె నుంచి రాకపోవడంతో కొంచెం ఆశ్చర్యపోయాడు సామ్రాట్.
‘‘మనిద్దరి గురించీ ఎవరో లేనిపోనివి కల్పించి మా ఆవిడకు చెప్పారంటే నీకేమీ అనిపించడంలేదా?’’ అన్నాడు.
‘‘ఉహూ.. ఈరోజు కాకపోతే ఎప్పుడైనా ఇది జరిగేదే అని తెలుసు కాబట్టి నేను మరీ నీ అంత ఆశ్చర్యపోవడం లేదు. కాకపోతే ఆ పరిస్థితిని నువ్వెలా ఎదుర్కొన్నావోననే విషయం గురించే ఆలోచిస్తున్నాను’’ అంది సాహిత్య.
‘‘ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇక నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏవిటో చెప్తావా?’’
‘‘మీ ఆవిడ మా ఇంటికొచ్చారు’’ అంది సాహిత్య.
సంభ్రమాశ్చర్యలతో నోరుతెరిచి అలానే ఉండిపోయిన సామ్రాట్‌ను పట్టి కుదుపుతూ ‘‘కంగారు పడకు.. మనిద్దరికీ పరిచయం ఉందనే విషయం తెలిసి నన్ను నిలదీసేందుకు ఆవిడ మా ఇంటికి రాలేదు’’ అంటూ సామ్రాజ్ఞితో తన పరిచయం గురించీ, ఆ తర్వాత ఆమె తమ ఇంటికి రావడం గురించీ వివరించింది సాహిత్య.
‘‘అంటే మనమధ్య పరిచయం ఉందని తెలియని సామ్రాజ్ఞి కాకతాళీయంగానే మీ ఇంటికి వచ్చిందన్నమాట’’ అన్నాడు సామ్రాట్ కొంచెం తేరుకుంటూ.
‘‘ఆ.. అంతే! ఆవిడతో గడిపిన కొద్ది సమయంలోనూ నాకర్థమైంది నువ్వెంత ప్రేమరాహిత్యంతో జీవితాన్ని గడుపుతున్నావో! ఆమె నీకెంత మాత్రమూ తగిన మనిషికాదు.
ఆవిడ నాతో ఉన్న కొద్దిసేపూ ఆవిడ మాటలు యాంత్రికంగా విన్నానే తప్ప మనసులో నీ గురించే ఆలోచిస్తూ గడిపాను’’ అంది సాహిత్య.
‘‘చాలా థాంక్స్ సాహిత్యా! సామ్రాజ్ఞి గురించి నేను చెప్పిన విషయాల్ని నీ అంతట నువ్వు ప్రత్యక్షంగా పరిశీలించి నిర్థారించుకోవడం నిజంగా ఎంతో శుభ పరిణామం అనిపిస్తోంది నాకు’’ అన్నాడు సామ్రాట్ ఆనందంగా.
ఆ సమయంలో అతడు తమ పరిచయం గురించి సామ్రాజ్ఞి తనను నిలదీయడం కూడా మర్చిపోయాడు తాత్కాలికంగా.
తను సాహిత్య సమక్షంలో ఉండగా ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా అధిగమించగలడని అనిపించిందతడికి.
సామ్రాట్ ఆలోచనలిలా కొనసాగుతోండగా, సాహిత్య మరోవిధంగా ఆలోచించసాగింది. ఇహ ముందేం చేయాలి? తనూ సామ్రాట్ కల్సుకోవడం మానేయాలా? తామిద్దరి గురించీ సామ్రాజ్ఞికి ఎవరో చెప్పినట్టుగానే తన భర్తకు కూడా మరెవరి ద్వారానో తమ పరిచయం సంగతి తెలిస్తే అతడి ప్రతిస్పందన ఎలా వుంటుంది?
సామ్రాజ్ఞి, సామ్రాట్‌ను నిలదీసినట్టుగా తన భర్త తనను తప్పుపడితే అందుకు సమాధానం తన దగ్గర సిద్ధంగా ఉందా?
తనెంతో ప్రాక్టికల్ అని మురిసిపోయే తన భర్త తను చెప్పే సమాధానాన్ని తేలిగ్గా తీసుకోగలడా?
ఒకవేళ తన భర్త తమ పరిచయాన్ని అతడి అహానికి దెబ్బగా భావిస్తే అప్పుడు తానేం చేయాలి?
మున్ముందు సామ్రాజ్ఞి, సామ్రాట్‌తో గొడవపడి దాన్ని మరింత పెద్దది చేసే అవకాశం ఉందా? అయినా తామిద్దరిమధ్యా అసలేం జరిగింది?!
ఒకరితో మరొకరు స్నేహంగా ఉంటున్నారంతే కదా! గతంలో ఒకరినొకరు ‘మీర’ని మన్నించుకునే తాము ప్రస్తుతం ఏకవచనంలో సంబోధించుకుంటున్నారు. అంతేనా?

-ఇంకాఉంది

సీతాసత్య