డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఇప్పుడు నా సంగతి విను. ఇక్కడ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచునాపల్లిలో ఎంతో సైంటిఫిక్‌గా, పరంపరాగతంగా ఎంతో ఠీవిగా రాగింగ్ జరుగుతుంది. మాకన్నా ఒక సం. సీనియర్స్‌ని నాన్నా అంటాము. రెండు సంవత్సరాల సీనియర్స్‌ని తాతా అంటాము. మూడు సంవత్సరాల సీనియర్స్‌ని ముత్తాతా అని పిలుస్తాము. అంటే ప్రతి సీనియర్‌కి ఒక కొడుకు ఉంటాడన్నమాట. రాగింగ్ చేయడానికి వాడికి విశేషాధికారం ఉంటుంది. అంటే ప్రతీ రాష్ట్రం, ప్రతీ ప్రాంతీయం వాళ్ళు వాళ్ళ వాళ్ళనే రాగింగ్ చేయాలి. నేను బెంగాలీవాడిని అయితే బెంగాల్ కోట నుండి వచ్చిన సీనియర్స్ రాగింగ్ చేయాలి. ఇదే విధంగా ఎన్‌ఆర్‌ఐలను ఎన్‌ఆర్‌ఐలే రాగింగ్ చేయాలి.
కనీసం ఎనిమిది తొమ్మిది నెలలు ఈ రాగింగ్ నడుస్తూనే ఉంటుంది. సీనియర్స్ ప్రెషర్స్‌కి పార్టీ ఇచ్చేదాకా రాగింగ్ జరుగుతూనే వుంటుంది. ఈ సమయంలో మా మీద ఎన్నో ఆంక్షలు ఉంటాయి. జైలులో ఉండే ఖైదీలలాగా. మేం కాలేజ్ కాంపస్ బయటికి వెళ్ళకూడదు. చాలా అర్జంటు పని అంటే అనుమతి తీసుకుని వెళ్ళవచ్చు. ఎనిమిది తొమ్మిది నెలలు మేం బూట్లు వేసుకోకూడదు. జీన్స్ కాని టీషర్టులు కాని ధరించకూడదు. కాంపస్ లోపల హవాయి చెప్పులు వేసుకోవాలి. చేతులు పొడవు, మెడను పూర్తిగా కప్పే బుషర్ట్‌లను మాత్రమే వేసుకోవాలి. మేం మిలటరీ కట్ చేయించుకోవాలి. నా దగ్గర పూర్తిగా చేతులున్న షర్టులు తక్కువగా ఉన్నాయి. అందువలన సగం చేతుల కల బుష్ షర్ట్‌ని వేసుకున్నాను. నేను కంప్యూటర్ రూమ్ వైపు వెళ్తున్నాను. దారిలో నాకు ఇద్దరు సీనియర్లు కనిపించారు. కాని వాళ్ళు మధ్యప్రదేశ్‌కి చెందిన వాళ్ళు. నేను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నియమం ప్రకారం వాళ్ళు నన్ను రాగింగ్ చేయలేదు. నేను కంప్యూటర్ రూము వరకు వెళ్తున్నానో లేదో నా బాస్‌కి విషయం ఎట్లా తెలిసిందో తెలియదు. ఉరుకులు పరుగులమీద అతడు వచ్చాడు. నా చెంప ఛెళ్ళు మనిపించాడు. అతడు నా షర్ట్‌కి ఉన్న షో బటన్లను పీకేశాడు. నా షర్ట్ చినిగిపోయింది. అతడు అడిగాడు- నీ స్కోర్ ఎంతరా?
నేను అన్నాను- ‘ఎనిమిది సర్’.
మళ్లీ వెంటనే ఛెళ్ళున నాలుగైదు చెంపదెబ్బలు. అతడు అరిచాడు-
‘‘ఇప్పుడు ఎంతరా నీ స్కోర్?’’
‘‘పదకొండు’’
‘‘రెండంకెల స్కోర్ ఫరవాలేదురా.. ఇక నువ్వు వెళ్ళవచ్చు..’’
చాలాసార్లు ఈ రాగింగ్ ఎంతో ఇంటిలిజెంట్ టైపులో వుంటుంది. ఒకసారి రాగింగ్ సమయంలో నన్ను అడిగారు- నీకు మూత్ర విసర్జన చేయాలనిపించినప్పుడు ఏం చేస్తావురా?’’
‘‘సర్.. విసర్జన చేస్తాను’’
‘‘ఒకవేళ ఎవరైనా మండుతున్న హీటర్‌పైన మూత్రం పోయమంటే ఏం చేస్తావురా?’’
‘‘ఆగి ఆగి పోస్తాను (నాకు కరెంటు తగలకుండా)
ఒరేయ్.. రాగింగ్ మీ మిలటరీలో ఏముందిరా.. మాదాంతో పోలిస్తే నయాపైసా అంత కూడా కాదు.
ఒకసారి నా బాస్ నన్ను వాడి రూమ్‌లోకి పిలిచాడు. నేను వెళ్ళాను. నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను. నా చుట్టుపట్ల ఐదారుగురు సీనియర్లు ఉన్నారు. వాళ్ళు బెంగాలుకు చెందినవాళ్ళు. వాళ్ళు చూస్తున్న చూపుల్లో ఎంత వేడి ఉందంటే నేను మాడి మసి అయిపోతానేమో అని అనిపించింది. అప్పుడే ఆ టేబుల్ మీద నా దృష్టిపడ్డది. అక్కడ డెట్టాల్, కత్తెర, బాండెజ్, దూది, పట్టీలు, నోవా సర్ఫ్ పౌర్ (రక్తం కారితే ఆపేందుకు వాడే పౌడర్) మొదలైనవి ఉన్నాయి. ఒక మూల స్ట్రెచర్ ఉంది. అంతే నా గుండెలు దడదడలాడాయి. దడ.. ఎక్కువ కాసాగింది.
అప్పుడే నా చెవిన ఆ మాటలు పడ్డాయి. నా బాస్ వాడి స్నేహితుడిని అడుగుతున్నాడు- ‘‘ఈ డెట్టాల్, నోవాసెల్ఫ్, పట్టీలు ఎందుకు పెట్టి ఉన్నాయో తెలుసా? ఒక్కసారిగా అతడు తల నావైపు తిప్పాడు. నా వంక అతడు చూసిన చూపు హిట్లర్ సమయంలో కూడా నాజీలు ఇంత అసహ్యంగా, క్రూరంగా యూదులను చూసి ఉండరు. పోయిన వారం రాగింగ్‌లో ఒక యువకుడి తలకి గాయం అయింది. రక్తం కారసాగింది. మా వద్ద ఫస్ట్‌ఎయిడ్ లేదు. పాపం వాడి రక్తం అంతా నేలపాలయింది. అందుకే ఇప్పుడు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము.
నా కాళ్లు చేతులు వణకడం మొదలుపెట్టాయి. లోపల భయం భయం. ఇక ఇప్పుడు దెబ్బలు.. దెబ్బలు.. స్ట్రెచర్‌పైని పడుకోబెట్టాడు. బెంగాల్‌లో నక్సలైట్లను ఇంటరాగేషన్ రూముకి నడిచి వెళ్ళేవాళ్ళు. వచ్చేటప్పుడు స్ట్రెచర్‌పైన వచ్చేవాళ్ళు అని నేను విన్నాను. ఇదంతా 70లో జరిగింది. ఆ దృశ్యం కళ్ళముందు భయంకరంగా కదలాడసాగింది. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నారు. ముక్కు నుండి రక్తం కారింది. పెదిమలు చిట్లిపోయాయి. తలని గోడకేసి కొట్టగానే తల పగిలింది. ఇక ఆ మాటలు నేను వినలేకపోయాను. ఒక్కసారిగా నేలపై కుప్పకూలాను. కింద కూర్చున్నాక నా గుండెలు దడదడ కొట్టుకున్నాయి. బాస్ ఆ చప్పుడు విన్నాడు. నా వంక చూడకుండా చెప్పుకుపోతున్నాడు- ‘యార్! ఆ రోజు కొంచెం ఆలస్యం అయినా ఇక వాడు ‘రామ్ నామ్ సత్యహై’ అయిపోయేవాడే. పాపం చచ్చిపోయేవాడు’- నా సీనియర్ మాటలు వినగానే తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. రాగింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ చచ్చిపోయారని నేను వార్తాపత్రికలలో చదివాను. నేను ఒక్కడినే.. ఏమీ తెలియని నగరంలో.. ఒంటరిగా తెలియని భాష.. ఎదురుగుండా సాక్షాత్ ఐదుగురు యమరాజులు. నాలో ఒణుకు.. అంతే నా సీనియర్ చెంపమీద ఛెళ్ళు వేశాడు. ‘నీ స్కోర్ ఎంత’ అని అడిగాడు. ‘ఏభై అయిదు’ అని నేనన్నాను.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత