రాష్ట్రీయం

భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ప్రత్యేక గస్తీ
హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో తనిఖీలు

హైదరాబాద్, జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం ఉదయం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరించిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీసహా అన్ని ప్రధాన పట్టణాలో హై అలెర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శనివారం తెల్లవారుజామున జరిగిన సంఘటనతో హైదరాబాద్ నగరం అలెర్టయ్యింది. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక సాయుధ దళాలు మోహరించాయి. నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో అలెర్ట్‌గా ఉండాలంటూ తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ పోలీస్ అధికారులను ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలోని పాతబస్తీ సహా శివారులో కార్డన్ సెర్చ్‌తోపాటు ఉగ్రవాద చర్యలపైనా గట్టి నిఘా వేశామని సైబరాబాద్ సిఐడి విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (చిత్రం) శంషాబాద్ విమానాశ్రయంలో బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది