రాష్ట్రీయం

ఆమెకోసం ఆటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే తొలిసారి షి-ఆటోలు
49మంది మహిళలకు సిఎం పంపిణీ
విజయవాడలో వినూత్న ప్రయోగం

విజయవాడ, డిసెంబర్ 4: విజయవాడలో సిఎం చంద్రబాబు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మగవారికి దీటుగా మహిళలు తమ కాళ్లపై నిలబడి అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో ఆటో రిక్షాలు పంపిణీ చేశారు. నగరంలోని తన కార్యాలయంలో ‘షీ ఆటో’ పథకం కింద ఆటో రిక్షాలను అందించారు. 49మంది మహిళలకు సుమారు రూ.కోటి విలువ చేసే ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిగా సీఎన్జీతో నడిచే ఈ ఆటోలు పర్యావరణరహితమే కాకుండా, మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి దోహదపడుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహిళా ఆటో డ్రైవర్లు సిఎం చంద్రబాబుకు శాలువా కప్పి సత్కరించారు. సుమారు 2లక్షలు విలువ చేసే ఆటోకు 7 శాతం సబ్సిడీ అందించిన ప్రభుత్వం, మిగిలిన మొత్తాన్ని 40 వాయిదాల్లో నెలకు రూ.4,500 చొప్పున చెల్లించే అవకాశం కల్పించింది. నెలకు రూ.18వేల వరకూ ఆటోలు నడపడం ద్వారా లబ్ధిదారులు ఆర్జించవచ్చని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) మహిళలకు అందించిన ఆటోలను జెండా ఊపి ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు