ఆ శ్రద్ధ ఎక్కువైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యే ‘ఆషిఖి-2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. ఆ సినిమా తర్వాత రెండు మూడు చిత్రాలు చేసినా కూడా ఈమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. దాంతో ఇప్పుడు గ్లామర్ పైనే శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘వర్షం’ చిత్రాన్ని ‘్భగి’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తోంది శ్రద్ధ. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని, అలాగే లిప్‌లాక్ సీన్లలో కూడా రెచ్చిపోయి నటిస్తున్నారట. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామర్‌ని బాగానే పండిస్తోందట శ్రద్ధాకపూర్. టైగర్‌ష్రాఫ్‌తో చిన్నప్పటినుంచి ఉన్న పరిచయంతోకాబోలు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందట! మొత్తానికి ఈ సినిమాలో గ్లామర్ ప్రదర్శనతో అవకాశాలు కొట్టేయడానికి బాగానే ఫిక్స్ అయింది శ్రద్ధాకపూర్.