AADIVAVRAM - Others

స్కేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధార గోడకి ఆనుకుని నిటారుగా నిలబడింది. ఆమె తండ్రి ధార నెత్తి మీంచి గోడ మీద చాక్‌పీస్‌తో గుర్తుగా గీత గీశాడు.
ధార పక్కకి వచ్చాక ఆయన కింద నించి స్కేల్‌తో ఆ గీతదాకా కొలవసాగాడు.
‘నేను కొలుస్తాను’ ధార చెల్లెలు కన్యక తండ్రిని కోరింది.
కన్యక లెక్కల క్లాస్‌లో గత వారంగా తూనికలు, కొలతలు పాఠాలు నేర్చుకుంటోందని తెలిసిన వారి తండ్రి నవ్వి పక్కకి తొలగాడు. కన్యక కుర్చీ ఎక్కి కొలిచి చెప్పింది.
‘అబ్బో! నువ్వు దాదాపు ఆరడుగుల పొడవున్నావు’
‘ఏమిటి? అది కరెక్ట్ కాదు. నువ్వు ఏ స్కేల్ వాడుతున్నావు?’ ధార అడిగింది.
‘నేను తయారుచేసింది’
‘అది తప్పు. నాన్నలా మనింట్లోని స్కేల్‌నే నువ్వు వాడాలి’
‘నిజమే. కొలతలు సరిగ్గా లేని స్కేల్ తప్పుడు కొలతలని సూచిస్తుంది. నువ్వు అర అడుగుని అడుగుగా మార్చేసావు. అడుగు ఎంతుండాలో తెలుసుకుని దాన్ని తయారుచేయాల్సింది’ తండ్రి చెప్పాడు.
‘ఇంకా నయం. టీచర్ మమ్మల్ని స్కేళ్లు తయారుచేసి తీసుకురమ్మన్నారు. దీన్ని తీసుకెళ్లేదాన్ని’ కన్యక చెప్పింది.
‘తప్పుడు కొలతలు కొలిచేది నువ్వొక్కదానివే కాదు. లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు. చాలా విషయాల్లో ప్రజలు తాము సొంతంగా తయారుచేసుకున్న కొలమానాన్ని వాడుతూంటారు’ తండ్రి చెప్పాడు.
‘కన్యక తప్ప సొంత కొలమానాన్ని చేసుకున్న వాళ్లు నాకెవ్వరూ తెలీదు’ ధార చెప్పింది.
‘నేను చెప్పేది ఈ స్కేళ్ల గురించి కాదు. ప్రతీ వారు తామెంత మంచివారో కొలిచే కొలమా నాలని తయారు చేసుకుంటారు. దాంతో తమలోని చెడుని తక్కువగా, మంచికి ఎక్కువగా కొలుచుకుంటారు. దేవుడు నియమాలని విస్మరించి తమ నియమాలతో ప్రవర్తిస్తూంటారు. అది తప్పు’
‘అంటే హోటల్లో చిల్లర ఇచ్చేపుడు వాళ్లు పొరపాటున పది రూపాయలు ఎక్కువిస్తే ‘అది నా తప్పు కాదు. సరిగ్గా లెక్కపెట్టని హోటల్ వాడిది తప్పు’ అని ఆ డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వకుండా అనుకోవడం లాంటిదా?’ ధార అడిగింది.
‘అవును. ఎప్పుడూ మనం దేవుడి కొలబద్దనే కేరెక్టర్ విషయంలో అవలంబించాలి’ తండ్రి చెప్పాడు.
****

తెలివికి పరీక్ష
-నారంశెట్టి ఉమామహేశ్వరరావు

ధారాపురంలో నివసించే ధర్మశీలుడు చేసేది వ్యవసాయమే. అయినా తెలివైనవాడిగా పేరు గడించాడు. నిత్యం గ్రంథాలు చదువుతూ జ్ఞానం పెంచుకోవడంతోపాటు వయసుతోపాటు పెరిగిన లోకజ్ఞానం తోడయింది. దాంతో గ్రామస్థులు సమస్యలలో ఉన్నప్పుడు ధర్మశీలుడిని కలిసి పరిష్కారం పొందుతుండేవారు.
ధర్మశీలుడి పొరుగువాడైన అనంతుడు వ్యాపారి. అతడికి తెలివైన వాడినన్న అహంభావం ఉండేది. వ్యాపారంలో లాభాలు గడించాలంటే తెలివితేటలు అవసరమనీ, అవి తన దగ్గర పుష్కలంగా ఉన్నాయని గ్రామస్థులతో చెప్పుకునేవాడు. అతడి దగ్గరకు సలహాలు కోరి ఎవరూ వచ్చేవారు కాదు. రోజూ ధర్మశీలుడి ఇంటికి వచ్చే జనాన్ని చూసి అతడి మీద అసూయ పెంచుకున్నాడు అనంతుడు.
ఒకసారి గ్రామస్థులందరూ రచ్చబండ దగ్గర సమావేశమై గ్రామదేవత పండుగ జరిపే విషయం చర్చిస్తుండగా, ధర్మశీలుడు చెప్పే సూచనలను గ్రామస్థులు ఆమోదించారు. అనంతుడు కూడా కొన్ని సూచనలు చేసినప్పటికీ అంతగా ప్రయోజనం లేనివి కావడంతో ఎవరూ పట్టించుకోలేదు.
అనంతుడికి కోపం వచ్చి ‘్ధర్మశీలుడు మీ అందరికీ బంధువన్న కారణంగా అతడి తెలివిని మెచ్చుకున్నారే తప్ప తెలివిలో నన్ను మించినవాడు లేడు. కావాలంటే పరీక్ష పెట్టి మాలో ఎవరు గొప్పవారో ఇప్పుడే తేల్చండి’ అన్నాడు.
ధర్మశీలుడు ‘నేను పోటీల్లో పాల్గొనాలని కోరుకోవడం లేదు. అనంతుడి సలహాలు నచ్చితే స్వీకరించండి’ అన్నాడు. అనంతుడు పంతానికి పోయి ‘ఉదారంగా ఇచ్చే గౌరవం నాకు వద్దు. పోటీలో పాల్గొని నీ తెలివి నిరూపించుకో’ అని సవాలు విసిరాడు.
ధర్మశీలుడు గ్రామ పెద్దల సూచన మేరకు ప్రశ్నించడానికి సిద్ధమయ్యాడు.
‘యజమానికీ నాయకుడికీ తేడా ఏమిటి?’ అని మొదటి ప్రశ్న అడిగాడు ధర్మశీలుడు.
‘యజమానికి ఎక్కువ ధనం ఉంటుంది. నాయకుడికి ఎక్కువ ప్రజాబలం ఉంటుంది’ అన్నాడు అనంతుడు. అది సరైనది కాదని ధర్మశీలుడు చెప్పడంతో సరైన జవాబు చెప్పమని గ్రామస్థులు ధర్మశీలుడిని అడిగారు.
‘మీరు చేయండి అంటాడు యజమాని. మనం చేద్దాం అంటాడు నాయకుడు’ అని ధర్మశీలుడు చెప్పగానే గ్రామస్థులు చప్పట్లు చరిచి ఆనందం తెలిపారు.
‘చదువు, జ్ఞానం... వీటిలో తేడా ఏమిటి?’ అని అడిగాడు ధర్మశీలుడు. ‘రెండూ ఒక్కటే. చదివేది జ్ఞానం కోసమే’ అన్నాడు అనంతుడు. అది సరైనది కాదన్నాడు ధర్మశీలుడు. ‘జ్ఞానం పెరగాలంటే చదువుకోవాలి’ మరోలా చెప్పాడు అనంతుడు.
అది కూడా సరైన జవాబు కాదని చెబుతూనే అసలైన జవాబు చెప్పాడు ధర్మశీలుడు. ‘చదువు అంటే మనకు కావలసింది తెలుసుకోవడం. జ్ఞానం అంటే మనకు అక్కరలేని దానిని వదిలిపెట్టడం’ అనగానే గ్రామస్థులు ఆనందంతో ధర్మశీలుడు గెలిచినట్టు ప్రకటించారు. అనంతుడు తల దించుకున్నాడు.
‘సలహాలు కోరి గ్రామస్థులు నన్ను ఆశ్రయించేది నా వృత్తిలో స్వార్థ గుణం లేకపోవడం వల్ల మాత్రమే. నువ్వు కూడా నీ ప్రవర్తన మార్చుకుని వృత్తిలో ధర్మం పాటిస్తూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడితే జనం నమ్ముతారు. అప్పుడు నీ సలహా కోరి వస్తారు’ అని ధర్మశీలుడు చెప్పడంతో బుద్ధిగా తలూపాడు అనంతుడు. ధర్మశీలుడి సలహా ప్రకారం ప్రవర్తన మార్చుకున్నాడు అనంతుడు. అతడు కూడా ప్రజలకు ఇష్టుడయ్యాడు.
***
ప్రపంచ శాస్తవ్రేత్తలు
జగదీశ్‌చంద్ర బోస్
-పి.వి.రమణకుమార్
జీవ పదార్థాలకు, నిర్జీవ పదార్థాలకు మధ్యగల పోలికలను, భేదాలను తెలుసుకొనడానికి, జీవితంలో ఎన్నో రోజులు అహర్నిశలూ కృషి చేసి శోధించి ‘మొక్కలకు శరీర నిర్మాణం లేకపోయినప్పటికీ వాటికి బాధ, సుఖము ఉంటాయ’ని తన అధ్యయనాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినవాడు ప్రొ.జగదీశ్ చంద్రబోస్.
భారతీయ ప్రముఖ శాస్తజ్ఞ్రులలో జగదీశ్ చంద్రబోస్ ప్రముఖుడిగా చెప్పుకోవచ్చు. ఈయన భౌతిక శాస్తవ్రేత్తగా ఉండి వృక్ష శాస్తవ్రేత్తగా రూపొందటం విశేషం. 1858న బెంగాల్‌లో జన్మించాడు. కళాశాల నుండి పట్టా పొందిన తర్వాత ఆయన వైద్యశాస్త్రం అధ్యయనం చేయడానికి లండన్ వెళ్లాడు.
1887లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్తవ్రేత్తగా నియమించబడ్డాడు. ఈయన ఎక్కువగా కాంతి మీద పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ‘అలసట’ అనేది జీవికి వౌలికమైన లక్షణమని నిరూపించాడు.
మొక్కలకు బాధ, సుఖము ఫైట్ హార్మోన్ ప్రసరణ ద్వారా కలుగుతాయని తెలియజేశాడు. మొక్కల ప్రతిస్పందనకు, జంతువుల స్పందనకు పోలికలున్నాయని ప్రతిపాదించినవాడు జగదీశ్.
జీవ పదార్థాలకు, నిర్జీవ పదార్థాలకు మధ్యగల పోలికలను, భేదాలను తెలుసుకోవడానికి, ఆయన మొక్కలను అధ్యయనం చేశాడు. మొక్కలపై ఎన్నో పరిశోధనలు చేసి వాటికి ప్రాణం ఉన్నదని, అవి తమ భావాలను కూడా వ్యక్తం చేస్తాయని మొక్కల పెరుగుదలను గుర్తించే ‘క్రెస్కోగ్రాఫ్’ను ఆయన కనిపెట్టాడు.
వృక్షశాస్త్ర పరిశోధనల్లో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన జగదీశ్ చంద్రబోస్ 1917లో కలకత్తాలో ‘బోస్ సంస్థ’ అనే సంస్థను స్థాపించాడు. 1920లో ఆబర్డీన్ యూనివర్సిటీ ఆయనకు ‘డాక్టర్ ఆఫ్ లాస్’ అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. మహా మేధావి జగదీశ్ చంద్రబోస్ 1937లో మరణించాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి