ఆంధ్రప్రదేశ్‌

మిస్టరీ వీడని శిశువు అదృశ్యం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అదృశ్యమై రెండు రోజులు గడిచినా నిందితుల గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో ఎపి ప్రభుత్వం వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రసవం జరిగిన తర్వాత తల్లి ఒడి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆ శిశువును అపహరించుకుపోయారు. శిశువు ఆచూకీ తెలుసుకునేందుకు పది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. శిశువు కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో నలుగురు డాక్టర్లు సహా 14 మంది వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు అనుమానిత మహిళల ఫొటోలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అతికించారు. నిందితుల గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇదే ఆస్పత్రి వద్ద డ్రైనేజి కాల్వలో రెండురోజుల శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది.