ఆకట్టుకున్న సితార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవిబాబు ముఖ్యపాత్రలో సురేంద్ర జి.ఎల్. దర్శకత్వంలో నిర్మాత రవికుమార్ నిర్మించిన చిత్రం ‘సితార’. సినీరంగంలో అందమైన జీవితాన్ని ఊహించుకుని సినీ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టినవారికి ఆ కల వెనుక ఎంతటి విషాదం దాగివుందో, ఎంతమంది జీవితాల్ని బలిచేసుకుంటున్నారనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రత్యేక షోను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జి.ఎల్.సురేంద్ర మాట్లాడుతూ, ఇది తన మొదటి చిత్రమని, హీరోయిన్ నేపథ్య కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించడం ఆనందంగా వుందన్నారు. నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ, మనం ఎన్నో సినిమాలు చూస్తున్నా కూడా మన మనసును కలచివేసే సినిమాలు కొనే్న వుంటాయని, అలాంటి కోవకు చెందిన సినిమా ఇదని, ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ బాగుందని అభినందించడం ఆనందంగా వుంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.