ఆంధ్రప్రదేశ్‌

శైవక్షేత్రాల్లో భక్తజన సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో సోమవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర, శ్రీముఖలింగం, రామతీర్థం తదితర ఆలయాల్లో అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, కోటప్పకొండ తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున శివరాత్రి రావడం ఎంతో విశేషమని భక్తులు భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.