సైజ్‌జీరో చూస్తే బంగారం బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పి.వి.పి. సినిమా పతాకంపై పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘సైజ్ జీరో’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత పి.వి.పొట్లూరి మాట్లాడుతూ- ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల తరువాత అనుష్క చేసిన చిత్రమిదని, ఈ సినిమా కోసం తను చాలా కష్టపడిందని, సినిమాను నిర్మించడం ఎంత కష్టమో, దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే కష్టమని, అందుకనే ఈ సినిమా కోసం ఓ గోల్డ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం పైరసీ ఎక్కువైన నేపథ్యంలో థియేటర్‌వరకు ప్రేక్షకుల్ని రప్పించడం కష్టమైపోయిందని, అందుకనే ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు లక్కీ డిప్ ద్వారా ఒకరిని సెలెక్టు చేసి కేజీ బంగారాన్ని అందిస్తామని, ఈ కాంటెస్ట్‌లో ప్రతి థియేటర్‌లో సినిమా చూసిన ప్రేక్షకుడికి ఓ కూపన్ ఇస్తారని, ఆ నెంబర్‌ను పి.వి.పి. సినిమా డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌కు మెసేజ్ పంపిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారని అన్నారు. అలా వచ్చిన అందరిలో 20మందిని సెలెక్టు చేసి ఆ 20 మందిలోనుండి ఫైనల్‌గా ఒకరిని సెలెక్టు చేసి కిలో బంగారాన్ని అందిస్తారని, మా బ్యానర్‌లోనుండి వచ్చే ప్రతి సినిమాకు ఇలాంటి కాంటాస్ట్‌లు పెడతామన్నారు.
అనుష్క మాట్లాడుతూ, కుటుంబంతో కలిసి సినిమా చూసేలా ఈ కాంటెస్ట్‌ను రన్ చేస్తున్నారని, మంచి సినిమా ఇదని, తప్పకుండా అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ, అందరికీ నచ్చే అంశాలున్న సినిమా ఇది. ఈనెల 27న భారీగా విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, కెమెరా:నిరవ్ షా, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, కథ, స్క్రీన్‌ప్లే:కనిక థిల్లాన్, నిర్మాత:పరం వి.పొట్లూరి, దర్శకత్వం:ప్రకాష్ కోవెలమూడి.