క్రైమ్/లీగల్

వ్యాపారి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 12: పలాస మండలం, చిన్ననీలావతి గ్రామానికి చెందిన హార్డ్‌వేర్ వ్యాపారి కొమరపల్లి చంద్రశేఖర్ (45) రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడితోటల్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం చంద్రశేఖర్ చిన్ననీలావతి గ్రామం నుంచి 15 ఏళ్లు క్రితం కాశీబుగ్గకు వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. సాయికాలనీలో నివాసముంటున్న శేఖర్ ఆదివారం మధ్యాహ్నాం ఇంటికి వచ్చేసరికి భార్య రజని వంట చేయకపోవడంతో బయట నుంచి భోజనం తెస్తానని చెప్పి బయటకు వచ్చి మళ్లీ ఇంటికి రాకపోవడంతో రాత్రింతా కుటుంబీకులు ఆచూకీ లభ్యం కాలేదు. జీడి తోటల్లో శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి సి ఐ అశోక్‌కుమార్ వెళ్లి ఆరా తీయగా, మృతుడు చంద్రశేఖర్‌గా గుర్తించారు. శేఖర్‌కు కొన్ని అప్పులు ఉన్నాయని, దుకాణం విక్రయించి అప్పులు తీర్చాలని ఇటీవల భార్యభర్తల మధ్య వివాదం జరిగినట్కుల తెలిసింది. శేఖర్ మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.