ఆంధ్రప్రదేశ్‌

స్మగ్లర్లను తరిమికొడితే కేసులుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : ఎర్రచందనం స్మగ్లర్లను తరిమికొడితే కేసులు ఉండవని రాయలసీమ జోన్ ఐజి గోపాలకృష్ణ అన్నారు. నల్లమల, శేషాచలం అటవీ పరిసర ప్రాంతాల్లోని యువకులు, ప్రజలు కలసికట్టుగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలను తరమికొట్టాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం అడవుల్లో బేస్‌క్యాంపులు, 280 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో స్కానర్లు ఏర్పాటుచేసి డాగ్‌స్క్వాడ్ బృందాల సాయంతో అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం టాస్క్ఫోర్స్ డిఐజి డాక్టర్ ఎం.కాంతారావు నేతృత్వంలో పెద్ద ఎత్తున టాస్క్ఫోర్స్, అటవీశాఖ, సివిల్ పోలీసులు శేషాచలం అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారన్నారు.