రాష్ట్రీయం

గుంటూరు ఆసుపత్రిలో పాము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోగులు, బంధువుల ఆందోళన

గుంటూరు, డిసెంబర్ 31: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. స్థానిక ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాము కనిపించడంతో రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆస్పత్రిలోని 113వ వార్డు అయిన ఎముకల విభాగంలో గల బాత్‌రూమ్‌లో పాము కనిపించింది. దీంతో రోగులు, వారి బంధువులు కలిసి పామును చంపివేశారు. సమాచారాన్ని అందుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు వెంటనే సిబ్బందిని తరలించి ఎలుకలను, పాములను పట్టుకోవాలని ఆదేశించారు. రోగులు, వారి బంధువులు తీసుకువచ్చే తినుబండారాలను ఆహారంగా తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్ధపదార్ధాలను అక్కడే వదిలి వేయడం వలన ఎలుకలు, పాములు వస్తున్నాయన్నారు. ఆస్పత్రిలో గల రంధ్రాలను పూర్తిస్థాయిలో పూడ్చివేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఏడాది ఆగష్టు 26వ తేదీన పిల్లల వార్డులో ఎలుక కనిపించి సంచలనం కలిగించింది. పసికందుపై ఎలుక పదే పదే దాడిచేసినప్పటికీ సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పసికందు బంధువులు ఆందోళన చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం స్పందించి అప్పటి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేశారు.
అయితే ప్రభుత్వం బదిలీ చేసినట్లు ప్రకటించిన రెండు నెలలు కూడా ఆదేశాలు రాకపోవడం, అదే సమయంలో పాము కనిపించడం మరో వివాదానికి దారితీసింది. రాష్ట్రప్రభుత్వం వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఆస్పత్రి ప్రక్షాళనకు పూనుకున్నారు. కార్పొరేషన్ కార్మికులు వందలమంది ఆస్పత్రిలో ఉన్న వ్యర్ధపదార్ధాలను, పాతబడిన సామాన్లను టన్నులకొద్ది తొలగించారు. ఆస్పత్రి ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరిగిందని ప్రభుత్వం భావించినప్పటికీ మరోమారు పాము కనిపించడంతో రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.