AADIVAVRAM - Others

సోమరి సిద్దప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దప్ప చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో అనాధగా మారిన సిద్దప్పను తాత వీరభద్రయ్య పెంచి పెద్ద చేశాడు. సిద్దప్పకు తల్లిదండ్రులు లేరనే కారణంగా వీరభద్రయ్య గారాబం చెయ్యడంతో అతడు సోమరిగా మారి ఏ పనీ పాటా లేకుండా జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు.
‘నేను పోయిన తర్వాత వీడెలా బతుకుతాడ్రా దేవుడా...’ అని వీరభద్రయ్య తెగ బాధపడుతూ ఉండేవాడు. ‘ఒరేయ్ సిద్దప్పా! కష్టపడటమనేది పురుష లక్షణంరా! నీ తోటివాళ్లు చక్కగా పెళ్ళిళ్లు చేసుకొని పిల్లా పాపలతో హాయిగా జీవిస్తున్నారు’ అని చిలక్కి చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్పినా వీరభద్రయ్యకి కంఠశోష మిగిలిందే తప్ప ఇసుమంత కూడా ప్రయోజనం కనిపించలేదు. చివరకు గ్రామ పెద్దలు కూడా చెప్పి చూశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం.
కనీసం పెళ్లి చేస్తేనైనా మారతాడేమోనని పెద్దల సలహా మేరకు పాపం వీరభద్రయ్య సిద్దప్పకి పెళ్లి సంబంధాలు కూడా వెతికాడు. కానీ ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడంలేదు. చివరకు తన పేరనున్న స్థిరాస్తినంతా అమ్మాయి పేర పెడతానన్నా లాభం లేకపోయింది. దీంతో - వీరభద్రయ్య అవే ఆలోచనలతో మంచాన పడ్డాడు.
ఇలా మధన పడుతూన్న వీరభద్రయ్యకు ఒకరోజు ఆ గ్రామానికి హిమాలయాల నుండి ఓ మహిమ గల స్వామీజీ వస్తున్నాడనే వార్త తెలిసింది. గ్రామస్థులంతా తండోపతండాలుగా వెళ్లి వారివారి కష్టాలను స్వామీజీకి విన్నవించుకుంటున్నారు. వాటికి పరిష్కార మార్గాలను చెబుతున్నాడు స్వామీజీ.
ఏ చెట్టులో ఏ మహిమ ఉందోనన్న చిన్న ఆశతో సిద్దప్పను తీసుకుని వీరభద్రయ్య స్వామీజీ దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించాడు. స్వామీజీ సిద్దప్పను పరిశీలనగా చూసి ‘నీ సోమరితనానికి తాతగారి గారాబమే కారణమైతే ఈ దేశంలో సగం మందికి పైగా సోమరులుగానే ఉండాలి. అసలు కారణం అది కాదు’ అంటూ ‘ఏమిటి నాయనా నీ కోరిక?’ అని అడిగాడు స్వామీజీ సిద్దప్పను.
‘నాకు అయాచితంగా కొన్ని లక్షలు కలిసి వచ్చేటట్లు చేయండి స్వామీజీ’ అన్నాడు సిద్దప్ప.
సిద్దప్ప ఆశకు చిరునవ్వు నవ్విన స్వామీజీ ‘ప్రస్తుతం మెండుగానే ఉన్నది కదా నాయనా! దానేం చేస్తావ్?’ అని అడిగాడు.
‘అదంతా నాకు తెలీదు స్వామీ! నా కోరిక తీరుతుందా? లేదా?’ అని అడిగాడు సిద్దప్ప అమాయకంగా.
తన సంచీలో వున్న చిన్న బెల్లం ముక్కను తీసి సిద్దప్పకు ఇచ్చి ‘మధ్యాహ్నం భోజనం మాని ఇచ్చిన బెల్లం ముక్కను భద్రంగా పెట్టి, సాయంత్రం దానిని నీవు స్వీకరించు. ఆ తర్వాత నా వద్దకు రా! నీ కోరిక తీరుస్తాను’ అన్నాడు.
‘అలాగే స్వామీజీ!’ అని సిద్దప్ప ఆతృతగా ఇంటికి వెళ్లి స్వామీజీ చెప్పినట్లే చేశాడు.
సాయంత్రం అయ్యేసరికి గండు చీమలు బెల్లం ముక్కను సగం తినేశాయి. అది చూసిన సిద్దప్ప కోపంతో గండు చీమలను నలిపి చంపేశాడు. తర్వాత స్వామీజీ వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు.
‘నీకిచ్చిన బెల్లం ముక్కను గండు చీమలు తినేశాయని వాటిని చంపేశావు. అలాగే అయాచితంగా వచ్చిన ధనం వెంట మరణం పొంచి ఉంటుందని గ్రహించావా? ఉచితంగా వచ్చినది ఏదైనా సరే మనకు ఆపదల్ని తెచ్చిపెడుతుందే తప్ప, మన కోరికల్ని తీర్చిపెట్టవు నాయనా! ఇకనైనా తత్వాన్ని తెలుసుకొని విలువైన కాలాన్ని వృధా చేయకు’ అని హితబోధ చేశాడు స్వామీజీ.
స్వామీజీ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన సిద్దప్ప పశ్చాత్తాపపడి తన సోమరితనాన్ని వదిలిపెట్టాడు. కష్టపడి పని చేయడం నేర్చుకున్నాడు. అనతికాలంలోనే పెళ్లి చేసుకొని భార్యాబిడ్డలతో సుఖజీవనం సాగించాడు.

ప్రపంచ శాస్తవ్రేత్తలు
డా.యల్లాప్రగడ సుబ్బారావు
-పి.వి.రమణకుమార్
మనిషి అధికంగా శ్రమించినప్పుడు, కండరాలు అలసట చెందినప్పుడు శరీరంలో కలిగే రసాయనిక మార్పులను గమనించి, వాటిని స్వస్థతపరిచే విధానంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫాస్ఫేట్ ద్రవ్యముల సృష్టిని కనుగొన్న ఘనుడు ఆంధ్రుడైన డా.యల్లాప్రగడ సుబ్బారావు. ప్రపంచంలోనే మేటి శాస్తజ్ఞ్రులలో ఒకడిగా ఖ్యాతి చెందినవాడు. ఈనాటికీ ఈయన కనిపెట్టిన పద్దతినే ప్రామాణికంగా ప్రపంచంలో పరిశోధనలు జరుగుతుండటం విశేషం.
తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యల్లాప్రగడ సుబ్బారావు ఆధునిక వైద్య విధానంలో ఘన విజయాలు సాధించిన మహోన్నత వ్యక్తి.
పౌష్టికాహార లోపంవల్ల కలిగే వ్యాధులు, రక్తహీనత వల్ల కలిగే వ్యాధుల నివారణ కోసం అనేక పరిశోధనలు చేసిన సుబ్బారావు అమెరికాలోని సియానమడ్ కంపెనీలోని లీడర్లీ లేబొరేటరీస్‌లో కొన్ని సంవత్సరాలపాటు పని చేశారు.
రక్తహీనత వ్యాధుల నిరోధానికి ‘బి.కాంప్లెక్స్’ వర్గానికి చెందిన ‘పోలిక్ యాసిడ్’ మిశ్రమాన్ని, తరువాత కేన్సర్ వ్యాధి నివారణకు పౌష్టికాహారానికి పరిశోధనలు జరిపి ‘టెరోవ్‌టిరిస్’లను కనుగొన్నాడు.
అలాగే 1947లో ‘హెట్రాజన్’, 1948లో ‘అసిత్రోమైసిన్’ లాంటి శక్తివంతమైన యాంటీ బయోటిక్స్‌ను కనుగొని మానవాళికి గొప్ప మేలు చేసినవాడు డా.యల్లాప్రగడ. అప్పట్లో విజృంభించిన ‘స్క్రూ’ వ్యాధి, బోదకాలు వ్యాధులకు మందు కనిపెట్టాడు.
పరిశోధనలు సాగిస్తూనే 1948లో డా.యల్లాప్రగడ మరణించారు. ‘లీడర్లీ’ సంస్థ వారు తమ లేబొరేటరీకి డా.వై.సుబ్బారావు మెమోరియల్ లైబ్రరీ అనే పేరు పెట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాకినాడలో ఆసుపత్రిని నెలకొల్పి ప్రభుత్వం వారు డా.యల్లాప్రగడ సుబ్బారావు జయంత్యుత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు.

జ్ఞాపకాల అటక
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఆ రోజు అటకని శుభ్రం చేయడానికి దీపేష్ తన మేనత్తకి సహాయం చేస్తున్నాడు. దుమ్ము పట్టిన ఓ పెట్టెని తెరిచి చూసి ఆవిడ ఆనందంగా చెప్పింది.
‘ఇందులోవన్నీ స్కూల్లోని నా సావెనీర్లు’
‘వీటిని ఎందుకు దాచావు?’ ఓ పొడుగాటి తాడుని తీసి చూస్తూ దీపేష్ అడిగాడు.
‘చిన్నప్పుడు ఈ రంగురంగుల తాడుని ఉంగరంలా వేలికి చుట్టుకునేదాన్ని. దీన్ని నా ఫ్రెండ్ హితేంద్ర ఇచ్చాడు. ఇది చూసేదాకా నాకతను గుర్తే లేదు’
ఆ పెట్టెలోని ఒక్కో వస్తువుని బయటికి తీసి అది తనకి ఎలా వచ్చిందో, దేనికి ఉపయోగించిందో ఉత్సాహంగా చెప్పసాగింది.
‘నీకసలు మరపు అనేదే లేదా అత్తా? ప్రతీది నీకు ఎవర్నో గుర్తు చేస్తోంది. నీ మెదడు జ్ఞాపకాలతో ఈ అటక కన్నా కిక్కిరిసి ఉంటుంది’ దీపేష్ అడిగాడు.
మేనత్త నవ్వి చెప్పింది.
‘మనిషి ఏదీ, ఎప్పుడూ మర్చిపోడని ఎక్కడో చదివాను. ప్రతీది మెదడులో స్టోరై ఉంటుంది. అవి బయటికి రావడానికి ఇలాంటివి తాళంచెవిలా ఉపయోగిస్తాయి’
‘మనిషి పెరిగే కొద్దీ ఈ అటక నిండుతుంటుంది అన్నమాట’ తల మీద వేలితో చూపిస్తూ దీపేష్ చెప్పాడు.
‘అవును. నేను ఈ అటకని చూసి చాలా సంవత్సరాలు అయింది. అందులోనివన్నీ చాలా తియ్యటి జ్ఞాపకాలని గుర్తుచేసేవే. ఇలాగే నీ మెదడులో కూడా చాలా విషయాలు స్టోరై ఉంటాయి’
‘నిజమే అత్తా. నేను కొంతకాలం వినకపోయినా, అకస్మాత్తుగా ఓ పాట నాకు గుర్తొస్తూంటుంది’
‘మొన్న గుళ్లోని సాధువు కుడి చేతికి ఉన్న జపమాలని చూసి నువ్వేమన్నావో గుర్తుందా?’ అత్త అడిగింది.
‘గుర్తుంది. ఆయన జపం చేసుకునేవాడని అందరికీ తెలియాలని దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు అన్నాను’ దీపేష్ చెప్పాడు.
‘ఈ అటక పాఠం వల్ల నీ ఆలోచన మారిందా?’
కొద్ది క్షణాలు ఆలోచించి దీపేష్ చెప్పాడు.
‘మారింది. చేతిలో జపమాల ఉంటే జపం చేయాలని, ఆ మంత్రాన్ని సదా గుర్తుకు తెస్తుంది’
‘నువ్వు చిన్నప్పుడే గీతా శ్లోకాలని బట్టీ పట్టాలని మీ నాన్న చెప్పడానికి కారణం ఇదే. నీ పై అటకలోకి అవి ఎక్కితే, ఇక ఎక్కడికీ పోవు. ఏదైనా ప్రదేశమో, వస్తువో చూస్తే నీకవి గుర్తుకు వస్తాయి’
‘అర్థమైంది. నేను మెళ్లో నా ఫేవరేట్ గాడ్ హనుమంతుని లాకెట్ వేసుకుంటాను. అద్దంలో చూసినప్పుడల్లా నాకు ఆయన గుర్తుకు వస్తూంటాడు.

-బి.మాన్‌సింగ్ నాయక్