అదిలాబాద్

పోలీసు కొలువులకు సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ కేంద్రాలు
* ఎస్పీ తరుణ్ జోషి
ఆదిలాబాద్ , నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున పోలీసు కొలువులను భర్తీ చేయనుందని, జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు పోలీసు శాఖలో చేరేందుకు సంసిద్దం కావాలని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. శుక్రవారం స్థానిక సెంట్రల్ గార్డెన్‌లో పోలీసు శాఖ, గిరిజన విద్యార్థి సంఘం సంయుక్తంగా జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించగా, ఎస్పీ తరుణ్ జోషి పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో పోలీసు శాఖ అధ్వర్యంలో ప్రతి డివిజన్ స్థాయిలో నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. కాగజ్‌నగర్‌లో ప్రారంభమైన కోచింగ్ సెంటర్‌కు సుమారు 400 మంది యువకులు హాజరవుతున్నారని అన్నారు. చదువుకున్న యువకులు ఉద్యోగంలో చేరుటకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారని, కొన్ని సంధర్బాల్లో మోసపోవడం కూడా జరుగుతుందన్నారు. కేవలం ప్రభుత్వపరంగా వెలువడిన నోటిఫికేషన్‌ను మాత్రమే అభ్యర్థులు నిజమైనదిగా పరిగణించాలని పేర్కొన్నారు. త్వరలో పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఎస్సైలు, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ప్రభుత్వపరంగా నోటిఫికేషన్ జారీ కానుందని, ఇప్పటి నుండే యువతీ యువకులు సంసిద్దం కావాలన్నారు. త్వరలో ఉట్నూరు ఐటిడిఏ, పోలీసుశాఖ అధ్వర్యంలో గిరిజన యువతీ యువకులకు కోచింగ్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కొమరంభీం కాంప్లేక్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుటకు అనేక అవకాశాలు ఉన్నాయని, నిరంతరం కష్టపడిన వారికి సత్పఫలితాలు ఉంటాయని అన్నారు. చెడు వెసనాలకు గురికాకుండా ఉజ్వలంగా, ఆదర్శప్రాయమైన మార్గాన్ని ఎంచుకొని తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకరావాలన్నారు. ఈ అవగాహన సదస్సుకు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులు హాజరైనందుకు ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవికాంత్ నాయక్, ఓయు విద్యార్థులు కృష్ణ, మహేందర్, ప్రవీణ్, ప్రశాంత్, శ్రీకాంత్ అధ్వర్యంలో జిల్లా యువకులు గ్రూప్స్ సిలబస్‌ను తెలుగులో ముద్రించిన పుస్తకంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ లక్ష్మినారాయణతో పాటు సుమారు 800 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.