రాష్ట్రీయం

చెన్నై రూట్లో పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి నేడు ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే
హైదరాబాద్, డిసెంబర్ 4: తమిళనాడులో కురిసిన భారీ వర్షానికి రైల్వే లైన్లు దెబ్బతినడంతో చెన్నై రూట్లో నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుపతి-చెన్నై సెంట్రల్-తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-చెన్నై సెంట్రల్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-విజయవాడ-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌లను శుక్రవారం రద్దు చేసినట్లు తెలిపింది. చెన్నై రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో విజయవాడ నుంచి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే వెల్లడించింది. డిసెంబర్ 5వ తేదీన విజయవాడ నుంచి న్యూఢీల్లీకి, అహ్మదాబాద్‌కు, అసన్‌సోల్ ప్రాంతాలకు మూడు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే వెల్లడించింది.