ఆంధ్రప్రదేశ్‌

భక్తజన సంద్రంగా రామతీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసారు. విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జలకలశానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంకణధారణ, యజ్ఞోపవీతధారణ అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు దంపతులు ప్రభుత్వం తరఫున శ్రీసీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. దేవాలయ అర్చకులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సులపై జిలకర్ర, బెల్లం ఉంచి తాళిబొట్టును సీతమ్మవారికి ధరింపజేశారు. మాంగల్యధారణ వేడుక కన్నుల పండువగా సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ముత్యాల తలంబ్రాల వేడుక నయనానందభరితంగా సాగింది. అనంతరం భక్తులకు తలంబ్రాలను పంచిపెట్టారు. కాగా, కల్యాణ ఘట్టం ముగిసిన వరకు దేవాదాయశాఖ మంత్రి లేకపోవడం నిరాశ మిగిల్చింది. ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపి ఝాన్సీలక్ష్మి, కలెక్టర్ దంపతులు, తిలకించారు.

పట్టువస్త్రాలను తీసుకొస్తున్న దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, తదితరులు
రామతీర్థంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్న అర్చకులు