శ్రీ కృష్ణామృతం

గోకులాష్టమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపక్ష మధ్య అష్టమిన అనంతుడు ఆవిర్భవించిన అదృష్టదినం
అచ్యుతునిదే విశ్వరూప విశే్వశ్వర రూపం శ్రీకృష్ణావతారం
అధోలోక ఊర్థ్వలోకములుమేరు పర్వతమధ్య పాళుసుల గొళుసులు
మధ్యమముననున్న మత్స్యలోక మేరు దండ విశ్వచక్రభ్రమణ కారిణ ఇరుసులు

ఆర్థరాత్రి అవతరించి అజుడు అర్జునుని ఆరాధ్యదైవం ఆవిర్భావం
తక్కువేమి తినలేదు త్రిశూలధారి త్రినేత్రుడైన చంద్రశేఖరుడ నిశివేళ జ్యోతిర్లింగం
వేదనాద ఘోష మంత్రమధ్యమున ముచికుందని మదముడచిన ముకుంద దామోదరం
దేవకీ దేవి గర్భసంజాతుడు పెను చీకటుల కావల ఏకాకృతి వెలుగు దేదీప్య వౌనం
యమునానది రెండు పాయలై వసుదేవుని యాగాని సుగమం చేసెను పుణ్యవతె్తై

ఇడాపింగళ నాడులలోని ప్రాణశక్తుల జీవుని ప్రతిశ్వాసలు హరిహఱుల శ్వాసల హంసలు
నాదబిందు సమ్మేళనం అష్టమి అర్థరాత్రిలోని అష్టాంగయోగ సమాధి అనుభూతులు
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశక్యైకుల వాడేవి హంస్యాల లాలిత్యం
జన్మాష్టమి శొంఠి బెల్లముల కలయిక నైవేద్య తీర్థప్రసాదం జీవ బ్రహ్యైక్య రహస్యం
శ్రీకృష్ణ సాక్షాత్కారం కోసం ఉన్నత్మావేషణ ఉపవాసం జాగరణం చాంద్రాయణ వ్రతం చాతుర్మాస దీక్షలు

వ్యాపించిన వాసుదేవుడు వసుదేవసుతుడు కంస రాక్షసహింసల వధించితీరును
ఉగత్రయ జీవులతో వసించు వసుథైక దివ్యాత్ముడు
సర్వ క్షేత్రములలోనిక్షిప్తమైన నిరంజన నీరజాక్షుడు బ్రహ్మాండప్రదాయకుడు
ఎందెందు వెదికి జూచిన అందందేగలదు అందరికీ ఆత్మజ్ఞాన ప్రదాయకుడు.

మాయల మబ్బుల మసక చీకటులను మట్టుపెట్టే మాధవుడు
నారములపై నిర్మిలముగా నిశ్చింత ప్రశాంత చిత్తముతో పరుండిన నారాయణుడు
గోవులను పాలించే నవనీత హృదయుడు నరులందరికి గో రక్షకుడు
కరుణాకటాక్ష వీక్షణంలో కృపారసంబు జల్లువాడు శ్రీకృష్ణ పరమాత్ముడు

రోహితీ నక్షత్ర జనిత మెరుపు కాంతుల జ్ఞాన ప్రకాశం మధురాతిపది అమృత వర్షం
కాళరాతి కటిక చీకటుల కాటుకల కాళీయున విషయ వాసనల విధ్వంసం
దేవదత్త నాదం పాంచజన్య శంఖారావం పార్థివ దేహ ఆవిర్భావం
పదునెనిమిది అక్షోహిణుల మధ్య అజ్ఞాన తిమిరముల పారద్రోలు గీతా ప్రబోధం

ప్రతి మానవ హృదయం బంధముల అజ్ఞానంధకార కారాగృహం
కోకొల్లల కోరికల కాపలాదారుడు లేని కోట గోడల మధ్యకరం త్రొక్కతాయి
పరమాత్ముడ్ని బుట్టలో పెట్టి తట్టతో మూసి కపాలము పైకెత్తిన సంసార నదిని దాటంగ వచ్చు
కారాగార ద్వారములే కాదు తనువుతలుపు లూడితే కైవల్య తలుపులే తెరుచుకుంటాయి.

సుడులు తిరుగు చూపరలగు సంసార నదీ ప్రవాహం అమితదుఃఖదాయకం
అహంకార మమకారముల ఇనుప గొళుసులు త్రెంచుకొనుట సత్యం
భగవంతున్ని భక్తితో మదిలో భద్రపరిచిన భవసాగరం దాటి భగవానుని సాక్షాత్కారం తథ్యం
శ్రీవత్సాంకుడిని శ్రీనిలయంలో నిలిపిన శ్రీహరీ కరుణాకటాక్ష వీక్షణలు అనునిత్యం లభ్యం

- ఆర్. లక్ష్మణమూర్తి 7207074899