శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

జటాయువును చూసిన శ్రీరాముడు(అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచవటికి వెళ్తున్న రామలక్ష్మణులకు పెద్ద దేహం కల గద్దరాజును, మహా పరాక్రమవంతుడిని, అగస్త్యుడు చెప్పిన మర్రిచెట్టు మీద వుండగా చూసి, రాక్షసుడీ రూపంలో వున్నాడని భావించారు. అతడిని ఎవరని అడిగారు వారు. జవాబుగా ‘రామచంద్రా! మీ తండ్రికి నేను మిక్కిలి ప్రియమైన స్నేహితుడిని’ అని చెప్పగా, వారు సంతోషించి, ఆయనను తమ తండ్రిలాగా గౌరవించి, ఆయన పేరు జటాయువు అని తెలుసుకున్నారు. జటాయువు తన పూర్వకథను, భూతాలు పుట్టిన విధం మొదలుపెట్టి చెప్పసాగాడు.
‘్భత సృష్టికి కారణభూతులై, పూర్వం కొందరు ప్రజాపతులు ఉద్భవించారు. వాళ్లలో మొదటివాడు కర్ధముడు. ఆ తరువాత విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరుడు, ప్రచేతుడు, పులహుడు, దక్షుడు, వివస్వతుడు చివరగా కశ్యపుడు ఉద్భవించారు. వీళ్లలో దక్షుడికి నలభై మంది కూతుళ్లు పుట్టారు. వాళ్లలో ఎనిమిది మందిని కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల పేర్లు - అదితి, దితి, దనువు, కాళి, క్రోధవశ, తామ్ర, మనువు, అనల. ఈ ఎనిమిది మందిని భార్యలుగా చేసుకున్న కశ్యపుడు వాళ్లతో ఇలా అన్నాడు.. ‘మీరు మూడు లోకాలను రక్షించేందుకు సమర్థులైన వాళ్లను, నాతో సమానమైన వారిని, కనండి’. ఈ మాటలకు అదితి, దితి, దనువు, కాళి అంగీకరించారు. మిగతావారు భర్త మాటను అంగీకరించలేదు. దరిమిలా, అదితి పదకొండు మంది రుద్రులను, ఎనిమిది మంది వసువులను, ఇద్దరు అశ్వినేయులను, పనె్నండు మంది ఆదిత్యులను, ముప్పై మూడు మంది దేవతలను కనింది. వీరంతా స్వర్గవాసులు. దితికి దైత్యులు పుట్టారు. సముద్రాలతో, వనాలతో కూడిన ఈ భూమంతా మొదలు వారిదే. దనువుకు అశ్వగ్రీవుడనేవాడు, కాళికకు నరకుడు, కాలకుడు అనేవారు జన్మించారు.’
‘తామ్రకు క్రౌంచి, భాసి, శే్వని, ధృతరాష్ట్రి, శుకి అనే ఐదుగురు కలిగారు. వారిలో క్రౌంచి ఊలూకాలను (గూబలు) కూడి భాసాలను కనింది. శే్యని గద్దలను, డేగలను కనింది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కనింది. శుకి నతను కనింది. సత వినతను కనింది. క్రోధ అనే భార్యకు ఐదుగురు కూతుళ్లు. సురస, మృగమంద, హరి, శే్వత, సురభి, భద్రమద, మాతంగి, శార్ధూలి, కద్రుక, మృగు పుట్టారు. మృగికి జింకలు పుట్టాయి. మృగమంద అనే ఆమెకు ఎలుగులు, సృమరాలు, చమరాలు జన్మించాయి. హరి అనే ఆమెకు సింహాలు; భద్రమతకు ఐరావతి; దానికి ఐరావత గజం, మాతంగోవులు, గంధర్వికి గుర్రాలు జన్మించాయి. లు; శార్ధూలికి వ్యాఘ్రాలు, గోలూంగాలు; శే్వతకు దిగ్గజాలు; సురభికి రోహిణి, గంధర్వి; రోహిణికి గోవులు, గంధర్వికి గుర్రాలు జన్మించాయి. సురసకు పడగల నాగుపాము పుట్టింది. కద్రువకు పాములు పుట్టాయి.’
‘మనువుకు మనుష్యులు పుట్టారు. మానవులు, మనుజులు అనే శబ్దానికి ఇదే సరైన ఉత్పత్తి అర్థం. మనుస్మృతికారుడైన మనువు వల్ల పాలించబడిన వారిని మానవులు, లేదా మనుజులు అనవచ్చు. ఈ మనుజులలో నాలుగు భేదాలున్నాయి. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనేవి. అనలకు సమస్తమైన ఫలవృక్షాలు జన్మించాయి. శుకి కూతురు, సతకూతురైన వినతకు అరుణుడు, గరుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. సురస చెల్లెలైన కద్రువకు భూమిని మోసే వేయిపడగల శేషుడు పుట్టాడు. కద్రువ నాగమాత అయింది. ఇక నేను సంపాతికి తమ్ముడిని. నా పేరు జటాయువు. శే్యని కుమారుడిని.. నీకిష్టమైతే నీకు నేను సహాయం చేస్తాను..’
(జటాయువు వంశ పరంపర.. కశ్యపుడు.. శుకి.. నత.. వినత.. అనూరుడు.. జటాయువు.. అంటే, కశ్యపుడికి ఆరవ వాడు జటాయువు. శే్యని, శుకి అనే వారిద్దరూ కశ్యపుడు భార్య అయిన తామ్ర కూతుళ్లు. జటాయువు, తన తల్లి పేరు శే్యని అన్నాడు కాని, తనకు ముత్తవ్వ అని చెప్పలేదు. కాబట్టి ఆమె పేరున మరొక ఆమె కలదని అనుకోవాలి.)
‘మాకు ఇతరుల సహాయం ఎందుకు? నువ్వేం సహాయం చేస్తావంటావేమో? చేయగలవని అడుగుతావేమో? ఈ అడవి ప్రవేశించలేనిది. తోవలు, డొంకలు సరిగ్గా లేవు. జనసంచారం అసలే లేదు. కంపలు కొట్టి తోవ చేయడం సాధ్యపడదు. దానికి తోడు ఇక్కడ రాక్షసులుంటారు. ఈ సందర్భంలో, మీరిద్దరూ అడవికి వేటకు పోతే, ఒంటరిగా వున్న సీతాదేవికి, మృగాల బాధ, రాక్షసుల బాధ లేకుండా నా బలంతో ఆమెను రక్షిస్తాను’ అని జటాయువు చెప్పాడు.
జటాయువు మాటలన్నీ ప్రీతితో విన్న శ్రీరాముడు తన తండ్రి స్నేహితుడైన ఆయనను సంతోషంగా కౌగిలించుకుని, తన తండ్రికి ఆయనకు కలిగిన స్నేహ విషయమంతా విని, ఇక తన భార్య సీత రక్షణ భారం ఆయనదే అని ఆయనకు అప్పగించి, అంతా కలిసి పంచవటి చూడడానికి వెళ్లారు. ఆ తరువాత వారంతా శీఘ్రంగా పంచవటి చేరుకున్నారు.

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు,
తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12