రాష్ట్రీయం

హైదరాబాద్.. భాగ్యనగరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ రీజియన్ అంతా నిజంగా భాగ్యనగరమే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, రియల్టీ, చలనచిత్ర పరిశ్రమ, వాణిజ్య, ఐటీ రంగంలో స్థబ్దత, ఆర్థిక మాంద్యం ఎదురైనా హైదరాబాద్ రీజియన్ నిజంగా సంపద నగరమే. అంతర్జాతీయ నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్ రీజియన్ ఆదాయం పన్ను వసూళ్లలో దూసుకుపోతోంది. హైదరాబాద్ రీజియన్ దేశం మొత్తం మీద ఆదాయం పన్ను వసూళ్లలో ఆరవ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆదాయం పన్ను వసూళ్ల వృద్ధిరేటు 19.8 శాతం నమోదుకాగా, హైదరాబాద్ రీజియన్‌లో వృద్ధిరేటు 25.8 శాతం నమోదైంది. జాతీయ స్థాయిలో ఎప్పటిలాగానే ముంబయి రీజియన్ 26.2 శాతం వృద్ధిరేటుతో రూ. 3.27 లక్షల కోట్ల పన్నులను వసూలు చేసింది. హైదరాబాద్ రీజియన్ 2017-18 సంవత్సరానికి రూ. 49,772.1 కోట్ల ఆదాయ పన్నును వసూలు చేసింది. 2016-17 సంవత్సరంలో రూ. 39.554.6 కోట్ల ఆదాయం పన్నును హైదరాబాద్ రీజియన్ ఐటీ శాఖ వసూలు చేసింది. దేశంలో ఇతర రీజియన్లతో పోల్చితే ముంబయి 26.2 శాతం వృద్ధి రేటుతో అగ్ర స్థానంలో ఉండగా, హైదరాబాద్ రీజియన్ పన్ను వసూళ్లలో 25.8 శాతం వృద్ధిరేటుతో రెండో స్థానంలో ఉండడం విశేషం. కాగా పన్నుల సేకరణను విశే్లషిస్తే ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, కోల్‌కతా, కొచ్చి, పాట్నా, లక్నో, భువనేశ్వర్‌లు వరుస క్రమంలో ఉన్నాయి. దేశం మొత్తం మీద 2017-18లో రూ.9.86 కోట్ల ఆదాయం పన్ను వసూలయింది. 2016-17తో పోల్చితే, హైదరాబాద్‌లో పన్నుల
వసూళ్లు పది వేల కోట్లు పెరగడం విశేషం. జాతీయ స్థాయిలో మొత్తం మొదటి ఆరు స్థానాల్లో మూడు స్థానాల్లో దక్షిణ భారతానికి చెందిన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ రీజియన్లు పన్నుల వసూళ్లలో ముందంజలో ఉన్నాయి. బెంగళూరు రూ.1,03,770 కోట్లతో మూడవ స్థానంలో, చెన్నై రీజియన్ రూ. 68,715.6 కోట్లతో నాల్గవ స్థానంలో ఉన్నాయి. పశ్చిమభారతానికి చెందిన ముంబయి మొదటి స్థానం, పుణే రూ. 51,609 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ రూ. 1,30,782 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ రీజియన్ ఆదాయం పన్ను వసూళ్లలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ రీజియన్‌లో వృద్ధిరేటు 17.7 శాతం నమోదైంది. ఇక్కడ రూ.46,799 కోట్ల ఆదాయం పన్ను వసూలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు, రీజియన్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు పరిధిగా ఉన్న హైదరాబాద్ రీజియన్ ఆదాయం పన్ను శాఖ ఆదాయం పన్ను వసూళ్లలో రికార్డును నెలకొల్పింది.