ఆంధ్రప్రదేశ్‌

రసాభాసగా చెక్‌డ్యామ్ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం: రసాభాస మధ్య ఎట్టకేలకు బందోబస్తుతో భువనచంద్ర చెక్‌డ్యామ్‌కు ఆదివారం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు శంకుస్థాపన చేశారు. చెక్‌డ్యామ్ వలన భూములు కోల్పోతున్న రైతులు, మహిళలు, కుటుంబ సభ్యులు శంకుస్థాపనను అడ్డుకోగా పోలీసులు చెదరగొట్టారు. శంకుస్థాపనకు ఉపయోగించిన పూజా సామగ్రిని, రాళ్లను మహిళలు చెల్లాచెదురు చేసి, గుంటను మట్టితో పూడ్చుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన రైతులు పూజాసామగ్రిని తగలబెట్టారు. పనులు అడ్డుకునేందుకు బలిజేపల్లికి చెందిన నిర్వాసితులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
మీకు న్యాయం చేస్తా: కోడెల
భూమి కోల్పోయిన రైతులు శంకుస్థాపన పనులకు అడ్డుకుంటున్నారని తెలుసుకుని సభాపతి కోడెల శివప్రసాదరావు చర్చలు జరుపుతుండగా రైతులు గ్రామస్థులకు చెప్పకుండా పనులు చేస్తున్నారని సభాపతిని నిలదీశారు. తాము చాలా పేదవాళ్లమనీ, డ్యామ్ వలన ఆ పొలాలు మునిగిపోతే తమ కుటుంబాలు బజారున పడతాయని, డ్యామ్ వల్ల ఊరు మునిగిపోతుందని రైతులు వాపోయారు. డ్యామ్ కట్టడానికి వీలులేదని, స్థలాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సభాపతి కోడెల మాట్లాడుతూ మీకు న్యాయం చేస్తానని, మీకు నష్టం జరగకుండా డ్యామ్ స్థలాన్ని మారుస్తానని, మీ పొలాలకు నీరు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
శంకుస్థాపన పనులను అడ్డుకున్న రైతులు...
మధ్యాహ్నం 3.30 గంటలకు కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు శంకుస్థాపన చేసేందుకు అదే స్థలం వద్దకు వచ్చారు. అప్పటికే ఆ ప్రాంతంలో గుమిగూడిన గ్రామస్థులు, రైతులు మంత్రి, సభాపతిలను శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. ఒకానొకదశలో గందరగోళం నెలకొనడమే కాకుండా తోపులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో పోలీసులు మహిళలు, రైతుల్ని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సభాపతికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. చుట్టూ పోలీసులు ప్రహరీగా మోహరించగా శంకుస్థాపన పూర్తిచేశారు. అనంతరం సభాపతి, మంత్రి మాట్లాడినా మహిళలు శాంతించలేదు. శంకుస్థాపన గుంటలను పూడ్చిన మహిళలు శంకుస్థాపన చేసిన వెంటనే సభాపతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పూజా సామగ్రిని, కొబ్బరిచిప్పలను, పూలను కాళ్లతో తొక్కి, విసిరేశారు. రైతులు పూజా సామగ్రిని గుంటలో వేసి దగ్ధం చేశారు. తమ ప్రాణాలు పోయినా డ్యామ్ కట్టడానికి ఒప్పుకోబోమని నినాదాలు చేశారు.
గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ, శిలాఫలకం
శిలాఫలకాన్ని, సభను అడ్డుకుంటారని తెలుసుకున్న అధికారులు బలిజేపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గనపవరంలో శిలాఫలకాన్ని ఏర్పాటుచేసి ప్రారంభించారు. అనంతరం సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

శంకుస్థాపన గుంటను మట్టితో పూడ్చివేస్తూ,
పూజా సామాగ్రిని తొలగిస్తున్న మహిళలు