రాష్ట్రీయం

ప్రజాసమస్యలపై ఉద్యమబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా శరవేగంతో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్న నేపథ్యంలో ఈనెల 20, 21 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రోడ్డెక్కించేందుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యూహరచన చేశారు. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యక్ష పోరు కోసం ముందుగా ఈనెల 20వ తేదీ రౌండ్ టేబుల్ సమావేశం, బ్యాంకుల్లో నగదు కొరతపై 21వ తేదీ బ్యాంకుల ఏటీఎం కేంద్రాల వద్ద పెద్దఎత్తున నిరసనలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో భవిష్యత్తు ఉద్యమ నిర్మాణం, ఐక్య కార్యాచరణ కోసం చర్చించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న ఉద్యమ సంఘాలు, ప్రజాస్వామిక మేధావులు, రచయితలు, కవులు, కళాకారులను ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
21న కాంగ్రెస్ నిరసన
దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో, ఏటీఎంల వద్ద తీవ్రమైన నగదు కొరత ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో నగదు కొరతపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈనెల 21న రాష్టవ్య్రాప్త నిరసనకు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆరోజు అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో నగదు కొరత తీవ్రంగా ఉందని, ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదా అని రఘువీరా నిలదీశారు. నగదు కొరతతో ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు పరిష్కార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న విషయం మరచిపోయారా అని నిలదీశారు.