రాష్ట్రీయం

2.75 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఏపీ ఎంసెట్-2018కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా 10వేల రూపాయల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు తక్షణం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు కోరారు. గురువారం సాయంత్రానికి ఎంసెట్‌కు 2,74,920 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి లక్షా 98వేల 234 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగానికి 75వేల 592 మంది, రెండు విభాగాలకు
కలిపి 1094 మంది దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44 రీజనల్ సెంటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని సాయిబాబు వివరించారు. ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన కాకినాడ జేఎన్‌టియూ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలను ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈనెల 25వ తేదీన అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశపరీక్షను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానంలో తనిఖీ చేసిన పిమ్మట పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. నకిలీ విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం లేకుండా బయోమెట్రిక్ తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈనెల 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు జారీచేస్తున్నారు. గురువారం సాయంత్రానికి లక్షా 78వేల 500 మంది హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మిగిలిన విద్యార్థులు త్వరితగతిన హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకుని అందులోని వివరాలను పరిశీలించుకోవాలని కన్వీనర్ సూచించారు. హాల్‌టిక్కెట్‌లో తప్పులు దొర్లిన పక్షంలో ఈమెయిల్ ద్వారా జేఎన్‌టియూకేలోని ఎంసెట్ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. హాల్‌టిక్కెట్ వెనుక భాగంలో గూగుల్ మ్యాప్ ఇచ్చామని, మ్యాప్‌లో నిర్దేశిత పరీక్షా కేంద్రానికి బస్టాండ్ ఎంత దూరంలో ఉన్నదో వివరించామని, ఆ ప్రకారం విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఒకరోజు ముందుగానే నిర్దేశిత పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని, పరీక్ష రోజు పరీక్షా సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మూడు రీజనల్ సెంటర్ల పరిధిలో ఒక రీజనల్ సెంటర్ పరిధిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. అతి కొద్దిమందికి మాత్రమే వారు ఎంపిక చేసుకున్న రీజనల్ సెంటర్ల స్థానే విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా దగ్గర్లోని రీజనల్ సెంటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు.