రాష్ట్రీయం

శ్రీరాముడే శిక్షిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట : భద్రాద్రి శ్రీరాముని సాక్షిగా టీ పీసీసీ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ..మొసలి కన్నీరు కారుస్తున్నారని.. పదవీ వ్యామోహంతో పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయటానికి యత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు పుట్టగతులుండవని.. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శ్రీరాముని సాక్షిగా అసత్యాలు చెబతున్న కాంగ్రెస్ నేతలను ఆ శ్రీరాముడే శిక్షిస్తాడని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన
విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భద్రాచలం అభివృద్ధిని టీఆర్‌ఎస్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దుర్మార్గమని దుయ్యపట్టారు. కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టుతో భద్రాద్రి ఆలయాన్ని ముంచటంతో పాటు, వేలాదిమంది గిరిజనుల నిరాశ్రయులు అవుతున్నారని అసెంబ్లీ సాక్షిగా అడ్డుకొని ఆందోళనలు చేసింది టీఆర్‌ఎస్ పార్టీయే అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలను ముంచి ప్రాజెక్టులు చేపట్టారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెకుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కాదా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం సందర్భంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు విభజన బిల్లులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే, మద్దతు ఇచ్చింది బీజేపీ అని అన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా పార్లమెంట్, అసెంబ్లీ సాక్షిగా పోరాడింది టీఆర్‌ఎస్ పార్టీ అని.. రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చోద్యం చూసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చిలుకపలుకులు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చేందుకు అధికారంలో ఉన్న మంత్రులు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి, జానారెడ్డిలు మక్కువ చూపారని, అప్పుడు పెదవులు మూసుకొని ఇప్పుడు అన్యాయం జరిగిందని మాట్లాడటం శోచనీయమన్నారు. భద్రాద్రి సన్నిధిలో అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు శ్రీరాముడే శిక్షిస్తాడని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు శాపమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం దివాల కోరు తనానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు శాపమనటానికి నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నీలం తుఫాన్ వస్తే నాటి సీఎం కిరణ్‌కుమర్‌రెడ్డి ఆంధ్రాలోని ఉభయ గోదావరి జిల్లాలకు నష్టపరిహారం చెల్లించి, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం రైతులకు మొండిచెయ్యి చూపాడని విమర్శించారు. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత రెండేళ్లకు నీలం బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించినట్టు తెలిపారు. ఆనాడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలకు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ రైతులకు ఎందుకు శాపమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, పెట్టుబడి సాయం కింద 8వేలు ఇస్తున్నందుకా, 17వేల కోట్ల రుణాలు మాపీ చేసినందుకా? యుద్ధ ప్రతిపాధికన ప్రాజెక్టులు నిర్మిస్తూ తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారుస్తున్నందుకా ? వెయ్యి కోట్లతో 17లక్షల టన్నుల గోదాంలు నిర్మించినందుకా ? కల్తి విత్తనాలు, ఎరువులు విక్రయించిన వారిపై పీడీ యాక్టు పెడుతున్నందుకా ? రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తున్నందుకా ? ఎందుకో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం మానకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంత్రి హరీశ్‌రావు