రాష్ట్రీయం

కోర్టు జోక్యం సమంజసమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: రాజ్‌భవన్‌లోగురువారం సాయంత్రం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. శాసనసభలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసి వారి సభ్యత్వాలను హైకోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపడుతూ ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించిన అంశాలను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్టు సమాచారం. శాసనసభలో బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించి వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా చట్టసభల్లో సభ్యుల సభ్యత్వాలను రద్దు చేస్తూ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు తీసుకున్న నిర్ణయాలను, అందుకు దారితీసిన పరిస్థితులను సీఎం వివరించినట్టు తెలిసింది. చట్టసభల్లో తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై తిరిగి శాసనసభను సమావేశపరిచి అందులోనే చర్చించాలని యోచిస్తున్నట్టు కూడా గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది. దీని కోసం ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరిచే అంశాన్ని గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీన రాష్టవ్య్రాప్తంగా ప్రారంభించనున్న రైతులకు ఉచిత పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గవర్నర్‌కు ఆయన వివరించారు.

చిత్రం..గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్