రాష్ట్రీయం

బాబు దీక్షాస్థలిలో భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ధర్మ పోరా ట దీక్షకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిం ది. విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రో జు నిర్వహించే ఈ దీక్షలను విజయవం తం చేసేందుకు వీలుగా రూ.20 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిసింది. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వేసవిని దృష్టిలో పెట్టుకుని వేదిక ప్రాంగణం మొత్తం టెంట్లు వేశారు. దీక్షా వేదిక ప్రాంగణం దగ్గరలో అత్యవస ర సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. దీక్షను వీక్షించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేశారు. ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ల చైర్మ న్లు, సుమారు 200మంది ఆసీనులైయ్యే లా దీక్షా వేదిక ముస్తాబైంది. కార్యక్రమాని కి తరలివచ్చే వారికి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు లు ఏర్పాటు చేశారు. ఎండ వేడిమికి తట్టుకునేలా దీక్షా వేదిక ప్రాంగణం మొత్తం చ ల్లబరిచేందుకు ఎయిర్‌కూలర్లు అమర్చా రు. స్టేడియంలో మొత్తం రెండు వేదికలు ఉంటాయి. ఒక వేదికపై చంద్రబాబు దీక్ష కార్యక్రమం, మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన వేదికపై 200 మంది, వేదిక ముందు 10వేల మంది కూర్చునేందుకు వీలు కల్పిస్తున్నా రు. ప్రజల ఆకాంక్ష అందరికీ తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చిత్రాలు..చంద్రబాబు నాయుడు దీక్షకు సిద్ధమవుతున్న వేదిక
* ఏర్పాట్లపై సమీక్షిస్తున్న ఏపీ మంత్రులు, అధికారులు