రాష్ట్రీయం

మట్టిలో మాణిక్యం రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వెయిట్ లిప్టర్‌గా పతకం సాధించడానికి రాహుల్ ఎంతో కష్టపడ్డాడని అందుకే ఈ గుర్తింపు వచ్చిందని, దాంతో రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది క్రీడాకారులకు ఒక ఐకాన్‌గా నిలిచాడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబిచ్చారు. ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో గురువారం సాయంత్రం 2018 కామన్ వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణపతకం విజేత రాగాల వెంకట రాహుల్ అభినందన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాగాల వెంకట రాహుల్‌ను ఘనంగా సన్మానించి రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. కోచ్ మాణిక్యాలరావుకు రూ.10 లక్షల పురస్కారాన్ని, రాహుల్ తండ్రి మధును సత్కరించి క్రీడల అభివృద్ధికి స్టువర్టుపురంలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, గుంటూరులో ఇంటి స్థలం చూసుకుంటే మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జాతీయ చెస్ చాంపియన్ లలిత్‌బాబును కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మీలో క్రీడా స్ఫూర్తి తనను ఎంతో ముగ్ధుడ్ని చేస్తోందన్నారు. రాగాల మధు తనకి తగిన ప్రోత్సాహం ఇస్తే మరింత మందిని తయారుచేస్తానని చెప్పడం స్ఫూర్తివంతంగా ఉందన్నారు. సమాజంలో ఆయన స్ఫూర్తితో ముందుకు రావడం అభినందనీయమన్నారు. స్టువర్ట్‌పురానికి పేరు తీసుకువచ్చి చరిత్రలోనే రాహుల్ నిలిచిపోయారన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను తొలిగా అమరావతిలోనే నిర్వహిస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు. క్రీడలకు తొలి నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, కరణం మల్లేశ్వరి, గోపీచంద్, కశ్యప్, శ్రీకాంత్, రుత్వికారాణి వంటి ఎందరో గొప్ప క్రీడాకారులను తయారుచేయడం జరిగిందన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో సింధు, శ్రీకాంత్ లాంటి ఎంతో మంది క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించామన్నారు. రాగాల రాహుల్‌కు గ్రూప్-2 ఉద్యోగాన్ని ప్రకటించారు. ఒలింపిక్ గేమ్స్‌లో రాహుల్ పతకాన్ని సాధిస్తే గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని క్రీడాకారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. క్రీడలు అంటే ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తుకు రావాలని, అందుకోసం తాను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నానని మీలోని ప్రతిభను చాటుకునే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడానికి తాను అండగా ఉంటానన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి, ఆదరించడానికి 2017-2020 సంవత్సరాల్లో క్రీడా పాలసీని తీసుకువచ్చామని, 6050 సమ్మర్ క్రీడా క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టువర్ట్‌పురం లాంటి గడ్డమీద పుట్టిన రాహుల్ మట్టిలో మాణిక్యమని, స్టువర్ట్‌పురానికే వనె్న తెచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించడంతో పాటు స్టువర్ట్‌పురం వెయిట్‌లిఫ్టింగ్ గ్రామంగా మారిపోయిందన్నారు. క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన రాహుల్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి బంగారు పతకం సాధించిన సందర్భంగా అభినందిస్తున్నానన్నారు. మృతి చెందిన తల్లి కాలి మెట్టెలను మెడలో ధరించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. సన్మాన గ్రహీత రాహుల్ మాట్లాడుతూ కామన్‌వెల్త్ పోటీల్లో బంగారు పతకం సాధించడం సంతోషదాయకంగా ఉందన్నారు. పతకం సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కోచ్ మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సతీష్ లాంటి వారు ఎందరో నాకు సహాయ సహకారాలు అందించారన్నారు. ఈ బంగారు పతకాన్ని మరణించిన నా తల్లికి అంకితం ఇస్తున్నానన్నారు. రాహుల్ తండ్రి రాగాల మధు మాట్లాడుతూ భారతదేశానికి మంచి పతకం తెస్తాడని ఎప్పుడో ఊహించానని, ఆ విధంగా వారిని తయారుచేయడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా సాయం అందించారన్నారు. రాహుల్ అభినందన కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అన్నం సతీష్, శాప్ ఎండీ బంగార్రాజు, కోచ్ మాణిక్యాలరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ కిషోర్, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అధ్యక్షుడు సూర్యనారాయణ, శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
చిత్రం..రాహుల్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు