రాష్ట్రీయం

తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/ద్వారకాతిరుమల, ఏప్రిల్ 27: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన ఇమ్మడి పృథ్వీతేజ్ తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికై సంచలనం సృష్టించాడు. సివిల్ సర్వీసు పరీక్షల్లో ఆయన అఖిల భారత స్థాయిలో 24వ ర్యాంకు సాధించారు. పృధ్వీతేజ్ చిన్న నాటి నుంచే చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పృథ్వీతేజ్ తండ్రి శ్రీనివాసరావు వ్యాపారి. తల్లి రాణి గృహిణి. పృథ్వీరాజ్ మూడవ తరగతి వరకూ ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట సెంట్ కెవిఆర్ పాఠశాలలోను, ఆ తర్వాత 6వ తరగతి వరకూ డీపాల్ పాఠశాలలో చదివాడు. 7వ తరగతి నుండి టెన్త్ వరకూ గుడివాడ విశ్వభారతి పాఠశాలలో, ఇంటర్ గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 2011లో ఐఐటీలో ఆల్ ఇండియా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం సౌత్ కొరియాకు చెందిన శ్యాంసంగ్ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. సివిల్ సర్వీసెస్‌కు ఎటువంటి కోచింగ్ లేకుండానే ప్రిపేరైన పృథ్వీతేజ్ పట్టుదలతో పరీక్షలకు హాజరయ్యాడు. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియాలో 24వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. పృధ్వీని గ్రామస్థులు పలువురు అభినందించారు. ఇలాఉంటే సివిల్స్ ఫలితాల్లో అనంతపురం వాసి భార్గవ్ తేజ 88 ర్యాంకు సాధించాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఎ.వెంకటేశులు, పద్మజ దంపతుల కుమారుడైన భార్గవ తేజ ఐఎఎస్ సాధించాలన్న పట్టుదలతో గత ఏడాది తొలి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌కు ఎంపిక కాగా ప్రస్తుతం నాగపూర్‌లో శిక్షణ పొందుతూనే రెండోదఫా రాసిన పరీక్షల్లో 88వ ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని ఛేదించగలిగారు. వీరి తండ్రి రాష్ట్రంలో గ్రేడ్-1 ఆఫీసర్‌గా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా భార్గవతేజ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి అన్ని స్థాయిల్లోనూ ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందించడమే తన లక్ష్యంగా పెట్టుకుని విధులు నిర్వహించగలనన్నారు. ఇదిలా ఉండగా సివిల్స్ పరీక్షల్లో రాష్ట్రంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ అభినందనలు తెలిపారు.

చిత్రం..సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించిన పృధ్వీతేజ్