రాష్ట్రీయం

జాతీయ ఫ్లీనరీ -- ఫ్రంటే కేంద్ర బిందువుగా సాగిన ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వార్షిక ప్లీనరీ అసాంతం పూర్తిగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే కేంద్ర బిందువుగా సాగింది. పార్టీ అధినేత, సిఎం కేసీఆర్ తన ప్రసంగంలో సింహభాగాన్ని ఫ్రంట్ ఏర్పాటు అవశ్యకతపైనే కొనసాగింది. ప్లీనరీ జరిగిన తీరు తెన్నులను విశే్లషిస్తే ఇది రాష్ట్ర ప్లీనరీగా కాకుండా జాతీయ ప్లీనరీగా చెప్పవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్, బిజేపీ కూటమీల హయాంలోని ప్రభుత్వాలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఇంతకాలం కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ వచ్చిన టిఆర్‌ఎస్ ఆ పార్టీతో సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకున్న సంకేతాలను ఇచ్చారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపి కూటమీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసారు. ఫ్రంట్ ఏర్పాట్లలో తలమునకలై రాష్ట్రాన్ని కేసీఆర్ వదిలేస్తారేమోనన్న పార్టీ శ్రేణులకు కూడా ప్లీనరీ నుంచి స్పష్టత ఇచ్చారు. ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నంత మాత్రాన హైదరాబాద్ విడిచి వెళ్లనని, ఇక్కడి నుంచే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పనున్నట్టు పార్టీ శ్రేణుల అనుమానాలకు తెరదించారు. జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించనుండటంతో రాష్ట్రంలో పార్టీలో, ప్రభుత్వంలో డిస్ట్రబెన్స్ లేకుండా చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు అవగతమైంది. అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల ముందు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని జరుగుతున్న ప్రచారానికి కూడా కేసీఆర్ తెరదించారు. వచ్చే ఎన్నికల్లో గెలువలేని ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్టు ప్లీనరీ సాక్షిగా కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఈ సారి టిక్కెట్ రాదేమోనన్న అనుమానంతో పక్క పార్టీల వైపు ఎవరు తొంగి చూడకుండా పరోక్షంగా భరోసా కల్పించారు. అయితే ఈ హామీ వల్ల వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహుల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లినట్టు అయింది. ఫ్రంట్ ఏర్పాటు కేంద్ర బిందువుగా ప్లీనరీ సాగడంతో వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసే విషయాన్ని విస్మరించినట్టు అయింది. అయితే అక్టోబర్ చివరలో కానీ, నవంబర్ మొదటి వారంలో కానీ భారీ ఎత్తున హైదరాబాద్ సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ సభకు ఫ్రంట్‌లో భాగస్వామ్యమయే పార్టీల నేతలను ఆహ్వానించనుండటంతో అది కూడా జాతీయ రాజకీయాల దిశగానే జరుగనుంది. మరీ వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడాన్ని పక్కన పెట్టినట్టే కనిపించిస్తుంది. తాను ఇంత వరకు జరిపించుకున్న సర్వే నివేదికల ఆధారంగా తిరిగి రాష్ట్రంలో టిఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందన్న పూర్తి ధీమాతో కేసీఆర్ ఉన్నారని పరోక్షంగా ప్లీనరీలో వ్యక్తమైంది.