రాష్ట్రీయం

బాబు పాలన అసత్యాలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రజలు ఆనందంగా లేరు *ఆయనది 420 దీక్ష *వైకాపా అధినేత జగన్ ధ్వజం
ఉయ్యూరు, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనందంగా లేరని వైఎస్సార్ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు తన పుట్టిన రోజు ఏప్రిల్ 20న చేసిన దీక్ష 420 దీక్షగా అభివర్ణించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం ఆయన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. మండలంలోని రాజుపేటలో ఉదయం ప్రారంభమైన యాత్ర కాటూరు, కడవకొల్లు, వీరవల్లి మీదుగా ఉయ్యూరు చేరింది. సాయంత్రం స్థానిక మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేసారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల మంచి జరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం దానిని తాకట్టు పెట్టారన్నారు. చేసిందంతా చేసి ఎన్నికలు వచ్చే సమయం కావడంతో ఇప్పుడు హోదాను తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబు దీక్ష గాంధీని చంపి గాడ్సే దీక్ష చేసినట్లు ఉందన్నారు. అసత్యాలు కప్పి పుచ్చి ఆయనకు అనుకూలంగా ఉండే మీడియాతో సత్యాలుగా ప్రజలను నమ్మించి మరోసారి వంచించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలంతా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. విశాఖపట్నంలో పెట్టబడుల సదస్సు నిర్వహించి 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని తన మీడియా ద్వారా వెల్లడిస్తారని, ఒక్క ఉద్యోగం కాని, పరిశ్రమ కాని వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఇసుక దందా జరుగుతున్నా ఆయనకు కన్పించదని, చివరికి పేదవాడికి కట్టే ఇంటిలో కూడ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనలు తాను దోచుకున్న సొమ్మును మదుపు చేసుకోవడానికేనని ఆయన పేర్కొన్నారు. అగ్రిగోల్డు ఆస్తుల ధరలు తగ్గించి తక్కువ ధరకు కైవసం చేసుకునేందుకు కుట్రపన్నారని అనుమానం వ్యక్తం చేసారు. బీజేపీతో తాము లాలూచీ పడ్డట్లు విమర్శించే ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీలో పదవి ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు.
గవర్నర్‌ను సుజనా చౌదరి ఎందుకు కలిసారో వెల్లడించాలని డిమాండు చేసారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, జిల్లాపార్టీ అధ్యక్షులు కె పి సారథి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు పేదవాడి ఇంటి కలను సాకారం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యలు మల్లాది విష్ణు, జోగి రమేష్, పార్టీ నాయకులు యార్లగడ్డ, జంపాన కొండలరావు, చక్రవర్తి, దాసే రవి తదితరులు పాల్గొన్నారు.