రాష్ట్రీయం

కోదండరామ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: టీజేఏసీ చైర్మన్ పదవికి ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో టీజేఏసీ కన్వీనర్‌గా కె. రఘును ఎన్నుకున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో ఇటీవల తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాజకీయ పార్టీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం టీజేఎస్ ఆవిర్భావ సభ సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. సభలో కోదండరామ్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. జోడు పదవులు ఉండరాదన్న భావనతో ఒక రోజు ముందే కోదండరామ్ రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమర వీరుల స్థూపం వద్ద కోదండరామ్, టీజేఏసీ నాయకులు సమావేశమయ్యారు. అక్కడ కోదండరామ్ రాజీనామా చేయడం, వెంటనే రఘను ఆ పదవికి ఎన్నుకోవడం జరిగింది.