రాష్ట్రీయం

చిల్లర రాజకీయాలు ఇకనైనా మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: సీఎం కే. చంద్రశేఖర్ రావు కుటుంబం బరితెగించి తెలంగాణను దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్షాలపైన, వ్యవస్థలపైనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తానే గొప్ప వ్యక్తిననే అహంతో ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం ఆయనస్థాయని చెబుతోందన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు పదవులు అవసరం లేదని, హైదరాబాద్‌లో తాను, భార్య మాత్రమే ఉన్నామని, పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, ఇప్పుడు కుటుంబాన్ని మొత్తాన్ని రాజకీయాల్లోకి తెచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

పిచ్చి పిచ్చి మాటలొద్దు
తాను, తన భార్య ప్రజా జీవితానికి అంకితమయ్యామని ఉత్తమ్ చెప్పారు. తమకు పిల్లలు లేరని, కుటుంబం లేదన్నారు. కేసీఆర్‌లా క్యారెక్టర్ లేని పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. కేసీఆర్ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దని, ఎక్కువ తెలివి ఉపయోగించవద్దని ఉత్తమ్ హెచ్చరించారు. ఎవడబ్బ సొమ్మని 500 కోట్ల రూపాయల విలువైన స్థలంలో 60 కోట్ల వ్యయంతో ప్రగతి భవన్ నిర్మించారని ప్రశ్నించారు. అప్పటికే సీఎం క్యాంపు ఆఫీసు ఉన్నప్పటికీ మళ్లీ ఎందుకు నిర్మించారని నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ, చివరకు ప్రధానికీ ఇటువంటి ఇల్లు లేదన్నారు. 9 ఎకరాలలో లక్ష చదరపు అడుగుల్లో ప్రగతి భవన్ నిర్మించి ప్రజల సొమ్ము దుబారా చేస్తూ విలాస జీవితం గడపడాన్ని తప్పుబట్టారు. విలాసవంతమైన ఇల్లు, కోట్ల రూపాయల విలువైన కార్లు ఖరీదు చేశారని ఆయన విమర్శించారు. ప్రజల డబ్బులతో పెండ్లి, పేరంటాలకు ప్రైవేటు జెట్ విమానాల్లో వెళుతున్నారని, కేరళకు పెండ్లి కోసం, కోల్‌కత్తాకు రాజకీయాల కోసం, పనికిరాని చైనా ట్రిప్‌కు ప్రైవేటు జెట్ విమానాల్లో వెళ్లారని నిలదీశారు.
మరణించిన రైతులకు, అమర వీరులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి మీ దగ్గర డబ్బులుండవా? అని ప్రశ్నించారు. ప్రజలు సొమ్ము దుర్వినియోగమైనప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. పైగా తాను ఆంధ్రోళ్ళ సంచులు మోస్తున్నానని అంటరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఉస్మానియా వర్సిటీలో సమావేశాన్ని నిర్వహించాలన్నారు. వర్సిటీ క్యాంపస్‌లో కాలు పెట్టలేని వ్యక్తి దేశం నడుపుతారా? అని ఎద్దేవా చేశారు.
ఉత్తమ్ దిష్టిబొమ్మ దగ్ధం
ఇలాఉండగా కేసీఆర్‌ను తూర్పారబట్టినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రాంమోహన్ నేతృత్వంలో కొంతమంది తెరాస కార్యకర్తలు ఖైరతాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ ఉత్తమ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.